AB De Villiers | అదంతా అబద్ధం.. ‘విరుష్క’ విషయంలో పెద్ద తప్పు చేశా: డివిలియర్స్
AB De Villiers : భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli) ఇంగ్లండ్ సిరీస్‌కు దూరం కావడంపై పలు వార్తలు ప్రచారమవుతున్నాయి. కోహ్లీ రెండోసారి తండ్రి కాబోతున్నాడని అనుకుంటున్నారు. ఈ వార్తలకు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్(AB De Villiers) వారం క్రితం చేసిన వ్యాఖ్యలు కూడా మరింత బలం చేకూర్చాయి. అయితే.. ఏమైందో గానీ ఈ మిస్టర్ 360...
AB De Villiers : భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli) ఇంగ్లండ్ సిరీస్‌కు దూరం కావడంపై పలు వార్తలు ప్రచారమవుతున్నాయి. వ్యక్తిగత కారణాలతోనే కోహ్లీ వైదొలిగినట్టు చెప్పినా సరే.. అందరూ కోహ్లీ రెండోసారి తండ్రి కాబోతున్నాడని అనుకుంటున్నారు. ఈ వార్తలకు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ (AB De Villiers) వారం క్రితం చేసిన వ్యాఖ్యలు కూడా మరింత బలం చేకూర్చాయి. అయితే.. ఏమైందో గానీ ఈ మిస్టర్ 360 మాట మార్చాడు. కోహ్లీ ప్రైవసీకి భంగం కలిగించి తాను పెద్ద తప్పు చేశానని అన్నాడు.
ఒకఅబద్దాన్ని అందరికీ చెప్పి నేను పెద్ద పొరపాటు చేశాను. కోహ్లీ, అనుష్కలు రెండో సారి తల్లిదండ్రులు కాబోతున్నారనేది అబద్ధం. అసలు ఏం జరుగుతుందో నాకే కాదు ఎవరికీ తెలియదు. ఇప్పుడు నేను చేయగలిగిందల్లా.. కోహ్లీకి అంతా మంచి జరగాలని కోరుకోవడమే అని డివిలియర్స్ వెల్లడించాడు. దాంతో ఫ్యాన్స్ అసలు నిన్ను కోహ్లీ వ్యక్తిగత జీవితం గురించి ఎవరు మాట్లాడమననారు అని డివిలియర్స్‌పై మండిపడుతున్నారు.
— Sanju Here 🤞| Alter EGO| (@me_sanjureddy) February 9, 2024
వారం క్రితం డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానల్ లైవ్‌లో మాట్లాడుతూ.. కోహ్లీ, అనుష్క రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారని చెప్పిన విషయం తెలిసిందే. కెరీర్లో ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడిన ఏబీ.. ప్రస్తుతం దక్షిణాఫ్రికా టీ20(SA20) లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు.

నిరుడు స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో సెంచరీలతో రికార్డు నెలకొల్పిన విరాట్.. కొత్తే ఏడాది స్వదేశంలో ఎప్పుడు మైదానంలోకి దిగుతాడో తెలియడం లేదు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు ఎంపికైన కోహ్లీ.. వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టులు ఆడలేదు. దాంతో, రాజ్‌కోట్ టెస్టుకు అయినా జట్టుతో కలుస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ, అతడు బీసీసీఐకి ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. సో.. కోహ్లీ సిరీస్ మొత్తం దూరమవుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకూ జరిగిన రెండు టెస్టుల్లో భారత్, ఇంగ్లండ్‌లు చెరొక మ్యాచ్ గెలిచాయి. కీలకమైన మూడో టెస్టు రాజ్‌కోట్‌లో ఫిబ్రవరి 15వ తేదీన జరుగనుంది.
ఇవి కూడా చదవండి
- Anand Mahindra | అటల్ సేతుపై జర్నీ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్ర
- Elephant | బిడ్డ సమాధి వద్ద.. బోరున విలపించిన ఏనుగు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

