DC vs MI | ఇండియన్ ప్రీమియర్ లీగ్-2022లో భాగంగా బ్రబౌర్న్ వేదిక ఇవాళ ముంబై – ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ జరుగనున్నది. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్లో ముంబై తరఫున ఐదుగురు కొత్త ఆటగాళ్లు అరంగ్రేటం చేస్తున్నారు. తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, మురుగన్ అశ్విన్, రిలే మెరెడిత్, తైమల్ మిల్స్ ఐపీఎల్లో ముంబై తరఫున తొలి మ్యాచ్ ఆడనున్నారు.
ఢిల్లీ జట్టు : పృథ్వీ షా, టిమ్ సీఫెర్ట్, మన్దీప్ సింగ్, రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్ కీపర్), రోవ్మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, కమలేష్ నాగర్కోటి.
ముంబై జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, అన్మోల్, ప్రీత్ సింగ్, కీరన్ పొలార్డ్, టిమ్ డేవిడ్, డేనియల్ సామ్స్, మురుగన్ అశ్విన్, టైమల్ మిల్స్, జస్ప్రీత్ బుమ్రా, బాసిల్ థంపి.