ఢిల్లీకి అద్భుతమైన ఆరంభం అందించిన పృథ్వీ షా (61) పెవిలియన్ చేరాడు. కృష్ణప్ప గౌతమ్ వేసిన బంతిని కట్ చేసేందుకు షా ప్రయత్నించాడు. ఆ సమయంలో టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతిని కీపర్ డీకాక్ సులభంగా అందుకున్నాడు. దీంతో ఢిల్లీ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (4)ను రవి బిష్ణోయి అవుట్ చేశాడు.
వార్నర్ కూడా బిష్ణోయి వేసిన బంతిని కట్ చేసేందుకే ప్రయత్నించాడు. కానీ టైమింగ్ సరిగా కుదరకపోవడంతో షార్ట్ థర్డ్ వద్దకు సులభమైన క్యాచ్ వెళ్లింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న బదోని దాన్ని చక్కగా అందుకోవడంతో వార్నర్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత 11వ ఓవర్లో రావ్‌మెన్ పావెల్(3)ను కూడా బిష్ణోయి వెనక్కు పంపాడు.
బిష్ణోయి వేసిన గూగ్లీని సరిగా అంచనా వేయలేకపోయిన పావెల్.. లెగ్‌సైడ్ కొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ అతని బ్యాట్‌ను తప్పించుకున్న బంతి వికెట్లను కూల్చడంతో పావెల్ కథ ముగిసింది. దీంతో 11 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ జట్టు 80 పరుగులు చేసింది.