David Warner: నన్ను భయపెట్టిన బౌలర్ అతడే : డేవిడ్ వార్నర్
David Warner: జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరుగబోయే పింక్ టెస్టుకు ముందు వార్నర్ మాట్లాడుతూ.. కెరీర్లో తనను భయపెట్టిన, అత్యంత కఠినమైన బౌలర్ ఎవరన్నది వెల్లడించాడు.
David Warner: త్వరలో టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోనున్న డేవిడ్ వార్నర్ వన్డేల నుంచి కూడా తప్పుకుంటున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరుగబోయే పింక్ టెస్టుకు ముందు వార్నర్ మాట్లాడుతూ.. కెరీర్లో తనను భయపెట్టిన, అత్యంత కఠినమైన బౌలర్ ఎవరన్నది వెల్లడించాడు. దశాబ్దకాలంలో ఎంతోమంది దిగ్గజ బౌలర్లను ఎదుర్కున్న ఆసీస్ ఓపెనర్.. సౌతాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ తనను బాగా భయపెట్టాడని చెప్పుకొచ్చాడు. 2016-17లో దక్షిణాఫ్రికా ఆసీస్ పర్యటనకు వచ్చినప్పుడు స్టెయిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం తనకు కత్తిమీద సాములా అనిపించిందని అన్నాడు.
క్రికెట్.కామ్.ఏయూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వార్నర్‌ను తాను చూసిన టఫెస్ట్ బౌలర్ గురించి చెప్పమని అడగ్గా అతడు బదులిస్తూ… ‘‘డేల్ స్టెయిన్.. ఆ విషయంలో డౌటే అక్కర్లేదు.. 2016-17లో వాకా (పెర్త్) స్టేడియంలో నేనూ, షాన్ మార్ష్ స్టెయిన్‌ను ఎదుర్కోవడానికి నానా తంటాలుపడ్డాం. ప్రత్యేకించి ఆ టెస్టులో 45 నిమిషాల సెషన్ అయితే మాకు చుక్కలు చూపించింది. ఆ సందర్భంలో మార్ష్ నా దగ్గరకు వచ్చి ‘నాకు అతడిని ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదు..’ అని చెప్పుకున్నాడు..’’ అని తెలిపాడు.

Dale Steyn
తాను ఎదుర్కున్న బౌలర్లలో స్టెయిన్ అత్యంత కఠినమైన పోటీదారు అని చెప్పిన వార్నర్.. లెఫ్ట్ హ్యాండర్ ను ముప్పు తిప్పలు పెట్టడంలో స్టెయిన్‌ది ప్రత్యేక శైలి అని అన్నాడు. రెండేండ్ల క్రితమే ఆటకు గుడ్ బై చెప్పిన స్టెయిన్.. టెస్టులలో 439 వికెట్లు, వన్డేలలో 196 వికెట్లు, టీ20లలో 64 వికెట్లు పడగొట్టాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

