David Warner | వన్డేలకూ వార్నర్ గుడ్ బై.. షాక్‌లో అభిమానులు
David Warner : కొత్త ఏడాది మొదటి రోజే ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner) అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. స్వదేశంలో పాకిస్థాన్(Pakistan)తో చివరి టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకనున్న డేవిడ్ భాయ్ వన్డేలకు కూడా....
David Warner : కొత్త ఏడాది మొదటి రోజే ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner) అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. స్వదేశంలో పాకిస్థాన్(Pakistan)తో చివరి టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకనున్న డేవిడ్ భాయ్ వన్డేలకు కూడా గుడ్ బై చెప్పేశాడు. అయితే.. 2025లో జరిగే చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025)కి అందుబాటులో ఉంటానని తెలిపాడు.
‘నేను టెస్టులతో పాటు వన్డేల నుంచి కూడా వైదొలుగుతున్నా. ఈ విషయాన్ని నేను వన్డే ప్రపంచ కప్(ODI World Cup) నుంచి చెప్తున్నా. రిటైర్మెంట్పై ఈ రోజు నిర్ణయం తీసుకున్నా. భారత గడ్డపై వరల్డ్ కప్ గెలవడం నా కెరీర్లో అతిముఖ్యమైన సందర్భం. ఒకవేళ నా శరీరం సహకరిస్తే వచ్చే ఏడాది చాంపియన్స్ ట్రోఫీలో ఆడుతా’ అని రెండుసార్లు వరల్డ్ కప్ విజేత అయిన వార్నర్ వెల్లడించాడు. అంతేకాదు ఇకపై అంతర్జాతీయ టీ20 లీగ్స్‌పై దృష్టి పెట్టనున్నట్టు ఈ స్టార్ ఓపెనర్ స్పష్టం చేశాడు.

ఈ లెఫ్ట్ హ్యాండర్ ఇప్పటివరకూ 161 వన్డేల్లో 6,932 పరుగులు సాధించాడు. అంతేకాదు 97.26 స్ట్రైక్ రేటుతో 22 సెంచరీలు బాదిన డేవిడ్ భాయ్.. ఆసీస్ తరఫున అత్యధిక శతకాలు బాదిన రెండో క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(Ricky Ponting) 29 సెంచరీలు అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ఓపెనర్‌గా ఆస్ట్రేలియా క్రికెట్‌పై చెరగని ముద్ర వేసిన వార్నర్ 111 టెస్టుల్లో 8,695 పరుగులు సాధించాడు. రికార్డు స్థాయిఓల 26 సెంచరీలు బాదాడు. అంతేకాదు రికీ పాంటింగ్(Ricky Ponting) తర్వాత ఆసీస్ తరఫున అత్యధిక రన్స్ కొట్టిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. వార్నర్ వెస్టిండీస్ పర్యటనకు దూరం కానున్నాడు. అయితే.. యూఏఈలో వచ్చే ఏడాది జరిగే ఇంటర్నేషనల్ టీ20(ILT20) లీగ్‌లో ఈ డేంజరస్ ఓపెనర్ మెరుపులు మెరిపించనున్నాడు.
ఇవి కూడా చదవండి
- PSLV-C58 | నిప్పులుచిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ-సీ58
- Ramya Pandian | సరికొత్త పోజులతో మతులు పోగొడుతున్న రమ్య పాండియన్..
- Road Accident | చాయ్ తాగేందుకు బైక్‌పై వెళ్తున్న యువకులు.. బొలెరో ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

