IPL 2023 : కొండంత లక్ష్య ఛేదనలో కష్టాల్లో పడిన ఢిల్లీని కెప్టెన్ వార్నర్(71 నాటౌట్) అర్ధ శతకంతో ఆదుకున్నాడు. రవీంద్ర జడేజా వేసిన 13వ ఓవర్లో వార్నర్ రెచ్చిపోయాడు. రెండు సిక్స్‌లు, ఒక ఫోర్ బాదాడు.అమన్ హకీం ఖాన్(1) క్రీజులో ఉన్నాడు. 14 ఓవర్లకు ఢిల్లీ 5 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. ఢిల్లీ విజయానికి 36 బంతుల్లో 114 రన్స్ కావాలి.
భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఆదిలోనే షాక్ తగిలింది. గత మ్యాచ్‌లో ఫిఫ్టీ బాదిన పృథ్వీషా(5)ను తుషార్ దేశ్‌పాండే ఔట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన ఫిలిఫ్ సాల్ట్(3), రిలే రస్సో(0)ను వరుస బంతుల్లో దీపక్ చాహర్ పెవిలియన్ పంపాడు. అక్షర్ పటేల్(15)ను దీపక్ చాహర్ ఔట్ చేయడంతో ఢిల్లీ సగం వికెట్లు కోల్పోయింది.
ఐపీఎల్ చివరి లీగ్ మ్యాచ్.. ప్లే ఆఫ్స్‌లో చోటు దక్కాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు డేవాన్ కాన్వే(87 52 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) రుతురాజ్ గైక్వాడ్(79 నాటౌట్ 50 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) ,సిక్సర్ల శివం దూబే(22 9 బంతుల్లో 3 సిక్స్‌లు) ధనాధన్ ఆడాడు. ఆఖరి ఓవర్లలో రవీంద్ర జడేజా దంచడంతో సీఎస్కే 3 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. ఐపీఎల్లో మొదట బ్యాటింగ్ చేసి అత్యధికంగా 22 సార్లు రెండొందలు కొట్టిన జట్టుగా ధోనీ సేన రికార్డు కొట్టింది. ఢిల్లీ బౌలర్లలో సకారియా, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నార్జ్ ఒక్కో వికెట్ తీశారు.