David Miller | పవర్ హిట్టర్ మిల్లర్ మెచ్చిన భారతీయ ఫుడ్ ఇదే
David Miller : విధ్వంసక బ్యాటర్ డేవిడ్ మిల్లర్‌కు ఎంతో ఇష్టమైన భారతీయ ఫుడ్ ఎంటో తెలుసా..? బటర్ చికెన్, నాన్ బ్రెడ్. ఈ రెండింటిని అతను ఇష్టంగా తింటాడట. అంతేకాదు 'మొహాలీ స్టేడియంలో ఆడడం ఎప్పుడూ ప్రత్యేకమే' అని చెప్పాడు. ఈ పవర్ హిట్టర్ పంజాబ్ కింగ్స్(Punjab Kings)పై చెలరేగేందుకు సిద్ధమవుతున్నాడు.
David Miller : ఐపీఎల్ 16వ సీజన్లో ఢిపెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్(Gujarat Titans) నాలుగో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న హార్దిక్ పాండ్యా సేన విజయంపై కన్నేసింది. తొలి రెండు మ్యాచుల్లో దంచిన విధ్వంసక బ్యాటర్ డేవిడ్ మిల్లర్ పంజాబ్ కింగ్స్(Punjab Kings)పై చెలరేగేందుకు సిద్ధమవుతున్నాడు. ఇంతకు ఈ పవర్ హిట్టర్‌కు ఎంతో ఇష్టమైన భారతీయ ఫుడ్ ఎంటో తెలుసా..? బటర్ చికెన్, నాన్ బ్రెడ్. ఈ రెండింటిని అతను ఇష్టంగా తింటాడట.
భారత్‌లో తన అనుభవాలు, తనకు ఇష్టమైన భారతీయ ఫుడ్ గురించిన ఒక వీడియోను గుజరాత్ టైటన్స్ విడుదల చేసింది. అందులో మిల్లర్.. తన ఫేవరెట్ ఫుడ్ బటర్ చికెన్, నాన్ బ్రెడ్ అని చెప్పాడు. అంతేకాదు గతంలో పంజాబ్ కింగ్స్‌కు ఆడిన అతను చండీగఢ్ సిటీ చాలా అందంగా ఉంటుందని, అక్కడ గడిపిన రోజులు గుర్తిండిపోతాయని తెలిపాడు. అంతేకాదు ‘మొహాలీ స్టేడియంలో ఆడడం ఎప్పుడూ ప్రత్యేకమే’ అని చెప్పాడు.
ఆరంభం ఘనంగా
గత సీజన్లో గుజరాత్ టైటిల్ నెగ్గడంలో మిల్లర్ కీలక పాత్ర పోషించాడు. ధనాధన్ బ్యాటింగ్‌తో జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. దాంతో, ఆరంగేట్రం సీజన్లోనే గుజరాత్ టైటన్స్ చాంపియన్‌గా అవతరించింది. ఈ జట్టు పదహారో సీజన్‌ను అంతే ఘనంగా ప్రారంభించింది. చెన్నై సూపర్ కింగ్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై మిల్లర్ దంచి కొట్టడంతో (31 నాటౌట్) 6 వికెట్ల తేడాతో నెగ్గింది. ఆడిన మూడు మ్యాచుల్లో రెండు విజయాలు, ఒక ఓటమితో గుజరాత్ నాలుగో స్థానంలో ఉంది. నిన్న చెన్నపై గెలిచిన రాజస్థాన్, లక్నో సూపర్ జెయింట్స్‌ను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్ సొంతం చేసుకుంది.

Butter F
ఇవి కూడా చదవండి
Ravichandran Ashwin | ఈ సీజన్లో అంపైర్ల తీరు చూసి షాకయ్యా : అశ్విన్
Iraq Footballer | రిఫరీపై దాడికి యత్నం.. ఇరాక్ ఫుట్‌బాలర్‌పై రెండేళ్ల నిషేధం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

