స్టెయిన్ అల్విదా..

- క్రికెట్‌కు సఫారీ దిగ్గజం వీడ్కోలు
జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రపంచ మేటి బ్యాట్స్‌మెన్‌ను తన సూపర్ బౌలింగ్‌తో ముప్పుతిప్పలు పెట్టిన ఈ స్పీడ్‌స్టర్.. క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు మంగళవారం ప్రకటించాడు. 38 ఏండ్ల స్టెయిన్.. తన 17 ఏండ్ల సుదీర్ఘ కెరీర్లో 93 టెస్టులు, 125 వన్డేలు, 47 టీ20లు ఆడాడు. తన రిటైర్మెంట్ గురించి స్టెయిన్ స్పందిస్తూ.. ‘ఈ రోజు నేను అత్యంత ప్రేమించే ఆట నుంచి రిటైర్ అవుతున్నాను. అందరికీ కృతజ్ఞతలు. ఇదొక అద్భుతమైన ప్రయాణం’ అని తన వీడ్కోలు లేఖలో స్టెయిన్ రాసుకొచ్చాడు. 2019లో టెస్టుల నుంచి తప్పుకున్న స్టెయిన్.. అప్పట్నుంచి పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితమయ్యాడు. కరోనాకు ముందు 2020 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో టీ20 మ్యాచే స్టెయిన్ చివరి మ్యాచ్. గత రెండేండ్లుగా తరుచూ గాయాలబారిన పడుతుండటంతో స్టెయిన్ రిటైర్మెంట్కు మొగ్గు చూపాడు.
ఐపీఎల్‌లోనూ ముద్ర
దక్షిణాఫ్రికా జట్టులోకి ప్రవేశించిన అనతి కాలంలోనే కీలక బౌలర్‌గా ఎదిగిన స్టెయిన్.. ఐపీఎల్‌లోనూ అదరగొట్టాడు. 2008 నుంచి ఐపీఎల్ ఆడిన ఈ స్పీడ్‌స్టర్.. 95 మ్యాచ్‌ల్లో 97 వికెట్లు తీశాడు. తొలుత బెంగళూరు తరఫున ఆడిన అతడు.. దక్కన్ చార్జర్స్, సన్ రైజర్స్లకు ఆడాడు.
ఆ రికార్డు స్టెయిన్ కే సొంతం
గత దశాబ్దంలో ప్రపంచ మేటి బ్యాట్స్‌మెన్‌కు ముచ్చెమటలు పట్టించిన స్టెయిన్.. దక్షిణాఫ్రికా బౌలింగ్‌కు వెన్నెముకలా నిలిచాడు. 2008-2014 వరకు (263 వారాలు) ఏకంగా ఆరేండ్ల పాటు ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌లో ఉన్నాడంటే అతని జైత్రయాత్ర ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు.
ఇరవై ఏండ్లుగా శిక్షణ, మ్యాచ్‌లు, ప్రయాణం, గెలుపు, ఓటమి, సంతోషం.. చెప్పడానికి ఇలాంటి ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. చాలా మందికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి.
స్టెయిన్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

