Dale Steyn | అమెరికా టీ20 లీగ్.. వాషింగ్టన్ ఫ్రీడం జట్టు బౌలింగ్ కోచ్‌గా స్టెయిన్
Dale Steyn : దక్షిణాఫ్రికా మాజీ స్పీడ్‌స్టర్ డేల్ స్టెయిన్(Dale Steyn) ఐపీఎల్ 16వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కు బౌలింగ్ కోచ్‌గా సేవలందించాడు. ఐపీఎల్ ముగియడంతో అతను కొత్త జట్టుకు పని చేయనున్నాడు. అవును.. త్వరలో ఆరంభం కానున్న అమెరికా టీ20 లీగ్(మేజర్ క్రికెట్ లీగ్)లో అతడు వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టుకు...
Dale Steyn : దక్షిణాఫ్రికా మాజీ స్పీడ్‌స్టర్ డేల్ స్టెయిన్(Dale Steyn) బౌలింగ్ సత్తా గురించి తెలిసిందే. ఒకప్పుడు లైన్ అండ్ లెంత్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టిన అతను కోచ్‌గా అవతారం ఎత్తాడు. ఐపీఎల్ 16వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) టీమ్‌కు బౌలింగ్ కోచ్‌గా సేవలందించాడు. ఐపీఎల్ ముగియడంతో అతను కొత్త జట్టుకు పని చేయనున్నాడు. అవును.. త్వరలో ఆరంభం కానున్న అమెరికా టీ20 లీగ్(Major Cricket League) లో అతడు వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా ఎంపికయ్యాడు.
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మోయినిస్ హెన్రిక్స్ ఫ్రీడం జట్టు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో మరికొందరు స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. మార్కో జాన్సెన్, వనిందు హసరంగ, అన్రిజ్ నార్జ్, గ్లెన్ ఫిలిఫ్స్, అడమ్ మిల్నే తొలి సీజన్లో సత్తా చాటేందుకు ఎదురుచూస్తున్నారు.జార్జ్ షిప్పర్డ్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు.
మా లక్ష్యం అదే..
‘ఇప్పటివరకు ఎంపిక చేసిన ఆటగాళ్ల పట్ల మేము సంతోషంగా ఉన్నాం. మోయిసెస్, గ్రెగ్‌కు టీ20లో చాలా అనుభవం ఉంది. వాళ్ల ఆధ్వర్యంలో సిడ్నీ సిక్సర్స్ జట్టు చాంపియన్‌గా నిలిచింది. జట్టులోని అందరిలో విజయ కాంక్షను పెంపొందించడమే మా లక్ష్యం. బౌలింగ్ లెజెండ్ స్టెయిన్ మా జట్టుకు సేవలందించడం మా అదృష్టం’ అని వాషింగ్టన్ ఫ్రీడం యజమాని సంజయ్ గొవిల్ తెలిపాడు. మేజర్ క్రికెట్ లీగ్ జూలై 13న ప్రారంభం కానుంది. తొలి సీజన్లో ఆరు జట్లు పాల్లొంటున్నాయి.
2021లో ఐపీఎల్‌కు వీడ్కోలు
ప్రపంచంలోని గొప్ప టెస్టు బౌలర్లో స్టెయిన్ ఒకడు. అతడు తన కెరీర్లో బుల్లెట్ లాంటి బంతులతో ప్రత్యర్థులను హడలెత్తించాడు. అనతికాలంలోనే దక్షిణాఫ్రికా జాతీయ జట్టులో కీలక బౌలర్‌గా ఎదిగాడు. 93 టెస్టులు ఆడిన అతను 439 వికెట్లు తీశాడు. ఐదుసార్లు 10 వికెట్లు, 26 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ఐపీఎల్లో ఆడాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున అద్భుతంగా రాణించాడు. 2021లో ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన స్టెయిన్ బౌలింగ్ కోచ్‌గా మారాడు.
ఇవి కూడా చదవండి
MS Dhoni | మహేంద్ర సింగ్ ధోని మోకాలి ఆపరేషన్ విజయవంతం..!
BCCI | 1,46,000 మొక్కలు పర్యావరణ పరిరక్షణ కోసం బీసీసీఐ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

