SA vs BAN | డికాక్ డబుల్ సెంచరీ మిస్.. బంగ్లా ఎదుట భారీ లక్ష్యం
SA vs BAN | ముంబైలోని వాంఖెడే వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్.. ద్విశతకానికి దగ్గరగా వచ్చాడు. డికాక్‌తో పాటు క్లాసెన్ కూడా వీరబాదుడు బాదాడు.
SA vs BAN | భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్‌లో తొలి డబుల్ సెంచరీ నమోదవుతుందేమోనని ఆశగా ఎదురుచూసిన క్రికెట్ అభిమానుల ఆశలు అడియాసలయ్యాయి. ముంబైలోని వాంఖెడే వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్.. ద్విశతకానికి దగ్గరగా వచ్చాడు. బంగ్లా బౌలర్లను క్లబ్ స్థాయి బౌలర్ల మాదిరిగా ఆటాడుకున్న డికాక్.. 140 బంతుల్లోనే 15 బౌండరీలు, 7 భారీ సిక్సర్ల సాయంతో 174 పరుగులు సాధించాడు. డికాక్‌కు తోడుగా కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (60), ఇంగ్లండ్‌తో పోరులో శతకంతో విరుచుకుపడ్డ హెన్రిచ్ క్లాసెన్ (49 బంతుల్లో 90, 2 ఫోర్లు, 8 సిక్సర్లు) మరోసారి రెచ్చిపోయాడు. సఫారీ బ్యాటర్ల విజృంభణతో నిర్ణీత 50 ఓవర్లలో దక్షిణాఫ్రికా.. 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన సౌతాఫ్రికాకు ఏడో ఓవర్లోనే షాక్ తగిలింది. హెండ్రిక్స్ (12) తో పాటు డసెన్ (1) విఫలమవడంతో సఫారీ జట్టు ఆత్మరక్షణలో పడింది. సింగిల్స్, డబుల్స్ మీదే దృష్టిపెడుతూ డికాక్.. మార్క్రమ్తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. 47 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తిచేసుకున్నాక డికాక్ గేర్ మార్చాడు. 20 ఓవర్లకు ఆ జట్టు వంద పరుగులు పూర్తి చేసుకుంది. మెహిది హసన్ వేసిన 26వ ఓవర్లో ఆఖరి బంతిని బౌండరీకి తరలించిన మార్కరమ్.. 57 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. డికాక్ – మార్క్రమ్లు 137 బంతుల్లో 131 పరుగులు జోడించారు. ఈ జోడీని బంగ్లా సారథి షకిబ్ విడదీశాడు. అతడు వేసిన 30వ ఓవర్ నాలుగో బంతికి మార్క్రమ్.. లిటన్ దాస్‌కు క్యాచ్ ఇచ్చాడు.
డికాక్, క్లాసెన్ విధ్వంసం..
నసుమ్ వేసిన 35వ ఓవర్లో తొలి బంతికి సింగిల్ తీసిన డికాక్ ఈ మెగా టోర్నీలో మూడో సెంచరీ పూర్తిచేశాడు. వంద బంతుల్లో అతడి శతకం పూర్తైంది. మార్క్రమ్ నిష్క్రమించాక క్రీజులోకి వచ్చిన క్లాసెన్‌తో కలిసి డికాక్ చెలరేగి ఆడాడు. షకిబ్ వేసిన 42వ ఓవర్లో 4, 6, 4 బాది 150 మార్కు దాటిన డికాక్.. డబుల్ కోసం యత్నించాడు. ఆ మేరకు ధాటిగా ఆడినా హసన్ మహ్ముద్ వేసిన 46వ ఓవర్లో తొలి బంతికే భారీ షాట్ ఆడబోయి డీప్‌లో నజుమ్ అహ్మద్ చేతికి చిక్కాడు. దీంతో 87 బంతుల్లోనే 142 పరుగుల డికాక్ – క్లాసెన్ ల భాగస్వామ్యానికి తెరపడింది.
మరోవైపు 34 బంతుల్లోనే అర్థ సెంచరీ చేసిన క్లాసెన్.. డికాక్ నిష్క్రమించాక బ్యాట్ ఝళిపించాడు. ముస్తాఫిజుర్ వేసిన 47వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు, ఓ బౌండరీ సాధించాడు. ఆఖర్లో క్లాసెన్..చివరి ఓవర్లో తొలి బంతికి సిక్సర్ కొట్టి 90లలోక వచ్చాడు. అతడి సెంచరీకి దగ్గరవుతున్న క్రమంలో.. రెండో బంతికే హసన్ మహ్ముద్ వేసిన స్లో బౌన్సర్‌ను ఆడబోయి స్వీపర్ కవర్ వద్ద ఉన్న మహ్మదుల్లాకు క్యాచ్ ఇచ్చివెనుదిరిగాడు. డేవిడ్ మిల్లర్.. 15 బంతుల్లోనే 4 భారీ సిక్సర్ల సాయంతో 34 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

