SA vs BAN | భారీ ఛేదనలో బెంబేలెత్తుతున్న బంగ్లా.. సగం మంది ఔట్
SA vs BAN | సౌతాఫ్రికా నిర్దేశించిన 383 పరుగుల లక్ష్య ఛేదనలో 16 ఓవర్లు ముగిసేటప్పటికే బంగ్లాదేశ్‌కు చెందిన ఐదుగురు ప్రధాన బ్యాటర్లు పెవిలియన్‌కు చేరడంతో ఆ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది.
SA vs BAN | వాంఖెడే స్టేడియం (ముంబై)లో బంగ్లాదేశ్ బౌలర్లను ఉతికారిసిన దక్షిణాఫ్రికా తర్వాత బౌలింగ్‌లో కూడా దూకుడు మీదుంది. సౌతాఫ్రికా నిర్దేశించిన 383 పరుగుల లక్ష్య ఛేదనలో 17 ఓవర్లు ముగిసేటప్పటికే బంగ్లాదేశ్‌కు చెందిన ఐదుగురు ప్రధాన బ్యాటర్లు పెవిలియన్‌కు చేరడంతో ఆ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో పరాజయాన్ని తప్పించుకోవడం బంగ్లాకు శక్తికి మించిన పనే కాగా ఓటమి అంతరాన్ని తగ్గించుకోవడం ఒక్కటే ఆ జట్టు ముందున్న తక్షణ కర్తవ్యం..
భారీ ఛేదనలో బంగ్లాదేశ్.. ఏడో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయింది. 16 బంతులాడి ఒక బౌండరీ సాయంతో 12 పరుగులు చేసిన తాంజిద్ హసన్‌ను మార్కో జాన్సెన్ ఔట్ చేశాడు. మరుసటి బంతికే శాంతో కూడా వికెట్ కీపర్ క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. విలియమ్స్ వేసిన తర్వాతి ఓవర్లో రెండో బంతికి కెప్టెన్ షకిబ్ అల్ హసన్ (1) కూడా క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు.
17 బంతులు ఆడి ఒక బౌండరీ సాయంతో 8 పరుగులు చేసిన వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫీకర్‌ను గెరాల్డ్ కొయెట్జ్ 12వ ఓవర్లో ఐదో బంతికి ఔట్ చేశాడు. 40 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన బంగ్లాకు రబాడా మరో షాకిచ్చాడు. అతడు వేసిన 15వ ఓవర్లోఆఖరిబంతికి ఓపెనర్ లిటన్ దాస్ (44 బంతుల్లో 22, 3 ఫోర్లు, 1 సిక్స్) వికెట్ల ముందు దొరికిపోయాడు. 17 ఓవర్లకు బంగ్లా ఐదు వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

