IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్ కోసం ప్యాట్ కమిన్స్(Pat Cummins) భారత్‌కు వచ్చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్(SunRisers Hyderabad) కెప్టెన్‌గా ఎంపికైన కమిన్స్ మంగళవారం హైదరాబాద్‌లో అడుగు పెట్టాడు. ఈసారి కొత్త ఫ్రాంచైజీ తరఫున బరిలోకి దిగుతున్న అతడు ఎయిర్‌పోర్ట్‌లో కొందరు అభిమానులతో సెల్ఫీ ఫొటో దిగాడు.
కెప్టెన్ రాకతో హైదరాబాద్ జట్టు ఫుల్ జోష్‌లో ఉంది. దక్షిణాఫ్రికా సిరీస్‌లో బ్యాటుతో, బంతితో చెలరేగిన న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిఫ్స్(Glenn Phliphs) సైతం ఆరెంజ్ ఆర్మీ క్యాంప్‌లో చేరాడు. ఈ ఇద్దరి రాకకు సంబంధించిన వీడియోలను హైదరాబాద్ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పెట్టింది.
Pat Cummin’s already loving Hyderabad! pic.twitter.com/cIVbm2YUgt
— SunRisers OrangeArmy Official (@srhfansofficial) March 19, 2024
Glenn Phillips has Joined SRH camp!pic.twitter.com/qvSwudEgYM
— SunRisers OrangeArmy Official (@srhfansofficial) March 19, 2024
ఐపీఎల్ 17వ సీజన్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్న హైదరాబాద్ జట్టుకు షాకింగ్ న్యూస్. తొలి విడతలో కొన్ని మ్యాచ్‌లకు స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ(Wanindu Hasaranga) సేవలను కమిన్స్ సేన కోల్పోనుంది. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు మ్యాచ్‌లకు ఎంపికైన హసరంగ కొన్ని ఐపీఎల్ మ్యాచ్‌లకు దూరమయ్యే చాన్స్ ఉంది.
వనిందు హసరంగ
పదహారో సీజన్లో తీవ్రంగా నిరాశపరిచిన హైదరాబాద్ ఈసారి టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. ఆస్ట్రేలియాకు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన కమిన్స్ సారథిగా ఎంపికవ్వడంతో హైదరాబాద్ జట్టుపై భారీ అంచనాలే ఉన్నాయి. ట్రావిస్ హెడ్, క్లాసెన్, మర్క్రమ్ వంటి హిట్టర్లతో కూడిన ఆరెంజ్ ఆర్మీ ఈసారి ఏ స్థాయిలో ఆడుతుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 ఎడిషన్‌లో హైదరాబాద్ మార్చి 23న కోల్‌కతా నైట్ రైడర్స్, మార్చి 27న ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.