BCCI | అరంగేట్ర హీరోలకు సెంట్రల్ కాంట్రాక్ట్.. ఏడాదికి కోటిపైనే ఆదాయం
BCCI : భారత యువ క్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan), ధ్రువ్ జురెల్(Dhruv Jurel)లు జాక్‌పాట్ కొట్టారు. ఇంగ్లండ్ సిరీస్‌లో ఇరగదీసిన వీళ్లకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కింది. మూడు టెస్టులు ఆడినందున ఈ ఇద్దరికీ భారత క్రికెట్ బోర్డు తాజాగా...
BCCI : భారత యువ క్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan), ధ్రువ్ జురెల్(Dhruv Jurel)లు జాక్‌పాట్ కొట్టారు. ఇంగ్లండ్ సిరీస్‌లో ఇరగదీసిన వీళ్లకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కింది. మూడు టెస్టులు ఆడినందున ఈ ఇద్దరికీ భారత క్రికెట్ బోర్డు తాజాగా ‘సీ’ గ్రేడ్ కాంట్రాక్ట్ ఖరారు చేసింది. సోమవారం బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఆ తర్వాత జురెల్, సర్ఫరాజ్‌లకు సెంట్రల్ కాంట్రాక్ట్ ఇస్తున్నట్లు ప్రకటన వెలువడింది.
సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కడంతో జెరెల్, సర్ఫరాజ్‌లు ఏటా రూ. 1 కోటి రూపాయలు ఆర్జించనున్నారు. టెస్టు క్రికెట్‌పై అమితమైన ఆసక్తితో పాటు ధనాధన్ ఆడగల సత్తా ఉన్నా ఈ ఇద్దరికీ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన రాజ్‌కోట్ టెస్టు(Rajkot Test)లో జురెల్, సర్ఫరాజ్‌లు అరంగేట్రం చేశారు.
ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్

తొలి మ్యాచ్‌లోనే సర్ఫరాజ్ తన బ్యాట్ పవర్ చూపిస్తూ రెండు ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో బాదాడు. మరోవైపు జురెల్ ఏడో స్థానంలో బరిలోకి దిగి ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడాడు. తొలి మ్యాచ్‌లో 46 పరుగులతో పర్వాలేదనిపించాడు. రాంచీ టెస్టులో జురెల్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. కుల్దీప్ యాదవ్‌తో కలిసి జట్టును ఆలౌట్ ప్రమాదం నుంచి బయట పడేశాడు. హాఫ్ సెంచరీ(96)తో జట్టును పోటీలో నిలిపిన జురెల్.. అనంతరం శుభ్‌మన్ గిల్(54 నాటౌట్)తో కలిసి భారత్ సిరీస్ విజయంలో భాగమయ్యాడు.

దాంతో, టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ గెలుపొందింది. బీసీసీఐ సెక్రటరీ జై షా పలుమార్లు చెప్పినా రంజీల్లో ఆడకుండా మొండికేసిన ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్లు కోల్పోయిన విషయం తెలిసిందే. వీళ్ల కాంట్రాక్టు పునరుద్దరణపై త్వరలోనే బీసీసీఐ నిర్ణయం తీసుకోనుంది.
ఇవి కూడా చదవండి
- Ras Malai | వరల్డ్ బెస్ట్ చీజ్కేక్స్లో మన రస్ మలైకి రెండో ర్యాంక్
- Anand Mahindra | తీవ్ర నీటి ఎద్దడి వేళ.. వినూత్న ఆలోచన పంచుకున్న ఆనంద్ మహీంద్రా.. VIDEO
- రెండు కప్పుల కాఫీ, రెండు రోల్స్‌కు రూ. 4000 బిల్లు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

