Ras Malai : భారత్‌కు చెందిన రస్ మలై ప్రపంచంలోని టాప్ 10 బెస్ట్ చీజ్ డెజెర్ట్స్లో రెండో ర్యాంక్‌లో నిలిచింది. ప్రముఖ ట్రావెల్, ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ ప్రకటించిన వరల్డ్ 10 బెస్ట్ చీజ్ డెజెర్ట్స్ జాబితాలో రస్ మలైకి టాప్ 2 పొజిషన్ దక్కింది. ఈ జాబితాలో పోలండ్‌కు చెందిన సెర్నిక్ తొలి ర్యాంక్‌లో నిలిచింది.
ఎగ్స్, షుగర్, ట్వరోగ్తో తయారయ్యే చీజ్‌కేక్ సెర్నిక్ను పోలండ్‌లో ఇష్టంగా ఆరగిస్తారు. సెర్నిక్ స్పాంజ్ కేక్‌గా ఫుడ్ లవర్స్‌ను ఆకట్టుకుంటుంది. దీని కింది భాగంలో జెల్లీతో టాప్‌లో ఫ్రూట్స్‌తో చూడగానే నోరూరిస్తుంది. ఇక మన రస్ మలై విషయానికి వస్తే బెంగాలీ మూలాలతో కూడిన ఈ భారతీయ స్వీట్‌ను తాజా జున్నుతో తయారుచేస్తారు.
షుగర్ సిరప్, బాదం, పిస్తాలతో కూడిన ఈ స్వీట్ భారతీయుల ఫేవరెట్ డిష్‌గా పేరొందింది. హోళి, దివాళి వంటి పండుగల్లో ఈ డెజెర్ట్ను ఇష్టంగా తీసుకుంటారు. ఇంకా బెస్ట్ చీజ్కేక్స్ జాబితాలో న్యూయార్క్ స్టైల్ చీజ్‌కేక్, జపనీస్ చీజ్‌కేక్, బాస్క్యూ చీజ్కేక్లకు టేస్ట్ అట్లాస్ టాప్ 10 జాబితాలో చోటు దక్కింది.
Read More :
Vastu Shastra | ఇంటికి ఎన్ని రోడ్లు ఉంటే.. అన్ని వైపులకూ గేట్లు పెట్టాలా?