RCB vs CSK : ఐపీఎల్ పదిహేడో సీజన్లో ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టే ఆఖరి జట్టేదో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. అవును.. నాలుగో బెర్తు కోసం శనివారం డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(CSK), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB)లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.
చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సారథి గైక్వాడ్ బౌలింగ్ తీసుకున్నాడు. వరుసగా ఐదు విజయాలతో జోరుమీదున్న ఆర్సీబీకి చెక్ పెట్టాలని చెన్నై భావిస్తోంది. చావోరేవోలాంటి మ్యాచ్ కావడంతో సీఎస్కే స్పిన్నర్ శాంట్నర్‌ను తీసుకుంది. మరోవైపు బెంగళూరు ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది.
ఆర్సీబీ తుది జట్టు : ఫాఫ్ డూప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, రజత్ పాటిదార్, కామెరూన్ గ్రీన్, మహిపాల్ లోమ్రోర్, దినేశ్ కార్తిక్(వికెట్ కీపర్), కరన్ శర్మ, యశ్ దయాల్, లాకీ ఫెర్గూసన్, సిరాజ్.
చెన్నై తుది జట్టు : రచిన్ రవింద్ర, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), డారిల్ మిచెల్, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ(వికెట్ కీపర్), మిచెల్ శాంట్నర్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, సిమర్జిత్ సింగ్, మహీశ థీక్షణ.