సన్‌రైజర్స్ యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (61 నాటౌట్) అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఎదుటి ఎండ్‌లో కెప్టెన్ కేన్ విలియమ్సన్ (32) పరుగులు చేయడానికి చెమటోడుస్తున్న సమయంలో అభిషేక్ మాత్రం చాలా ఈజ్‌తో బ్యాటింగ్ చేశాడు. మూడో ఓవర్లో అవుటయ్యే ప్రమాదం తప్పించుకున్న అతను.. ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు.
ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే 13వ ఓవర్ తొలి బంతికి విలియమ్సన్ అవుటయ్యాడు. అయితే అప్పటికే వీళ్లిద్దరూ సన్‌రైజర్స్ విజయానికి పునాదులు వేశారు. ఓపెనర్లిద్దరూ రాణించడంతో సన్‌రైజర్స్ జట్టు 14 ఓవర్లు ముగిసే సరికి 108/1 స్కోరుతో నిలిచింది.