CSK vs DC | ఐపీఎల్ 14వ సీజన్ తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన ధోనీ సేన.. ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీం.. నేరుగా ఫైనల్స్‌కు చేరనుంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ మూడుసార్లు ఐపీఎల్ ట్రోఫీ సాధించింది.