IPL 2023 | చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లో బర్త్ డే సందడి.. వీడియో చూశారా..?
IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్‌కు తెరలేవడానికి ఒక్క రోజు మాత్రమే ఉంది. ప్రాక్టీస్ జోరు పెంచిన సీఎస్కే ఆటగాళ్లు ఈ రోజు కాసేపు సరదాగా గడిపారు. ఆల్‌రౌండర్ డ్వేన్ ప్రిటోరియస్ (Dwaine Pretorius) పుట్టినరోజు కావడంతో ఫ్రూట్ కేకు తెప్పించి అతడిని ఆశ్చర్యానికి గురి చేశారు.
IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్‌కు తెరలేవడానికి ఒక్క రోజు మాత్రమే ఉంది. ఆరంభ పోరులో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్(GT)ను చెన్నై సూపర్ కింగ్స్(CSK) ఢీ కొననుంది. ప్రాక్టీస్ జోరు పెంచిన సీఎస్కే ఆటగాళ్లు ఈ రోజు కాసేపు సరదాగా గడిపారు. కారణం ఏంటంటే.. ఆల్‌రౌండర్ డ్వేన్ ప్రిటోరియస్ (Dwaine Pretorius) పుట్టినరోజు. దాంతో, ఫ్రూట్ కేకు తెప్పించి అతడిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఊహించిన పరిణామంతో షాక్ తిన్న ప్రిటోరియస్ భార్య, కొడుకుతో కలిసి కేకు కట్ చేశాడు.
ఈ సందర్భంగా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni)తో పాటు జట్టు సభ్యులు, సపోర్టింగ్ స్టాఫ్ అందరూ చప్పట్లు కొడుతూ ప్రిటోరియస్‌కు బర్త్ డే విషెస్ తెలిపారు. ప్రిటోరియస్ బర్త్ డే సెలబ్రేషన్ వీడియోను సీఎస్కే యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. మాజీ క్రికెటర్లు డ్వేన్ బ్రావో, మైక్ హసీ, స్పిన్నర్ మిచెల్ శాంట్నర్.. తదితరులు ఈ ఆల్‌రౌండర్‌కు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సీజన్లో అతడు అద్భుతంగా రాణించాలని అంతా ఆకాంక్షించారు. 2022 మెగా వేలంలో సీఎస్కే ఈ దక్షిణాఫ్రికా క్రికెటర్‌ను రూ.50 లక్షల కనీస ధరకు సొంత చేసుకుంది. సఫారీ జట్టుకు వన్డేలు, టీ20ల్లో ప్రాతినిథ్యం వహించిన ఈ ఆల్‌రౌండర్ ఈ ఏడాది జనవరి 9న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టీ20 లీగ్స్‌లో మాత్రమే ఆడుతున్నాడు.
ఆరంభం అదిరిపోయేలా..
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రేపు (మార్చి 31న) ఐపీఎల్ పండుగ షురూ కానుంది. సాయంత్ర 5ః30 గంటల నుంచి ఓపెనింగ్ సెరమొనీ జరగనుంది. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్ని, కార్యదర్శి జై షాతో పాటు పలువురు అధికారులు టోర్నీ ప్రారంభ వేడుకలకు హాజరుకానున్నారు. ఇండియా క్రష్‌గా పేరొందిన కన్నడభామ రష్మిక మందాన (Rashmika Mandanna), మిల్క్‌బ్యూటీ తమన్నా భాటియా (Tamanna Bhatia) ఆరంభ వేడుకల్లో డాన్స్‌తో అలరించనున్నారు. బాలీవుడ్ పాపులర్ సింగర్ అర్జిత్ సింగ్(Arjith Singh) తన గాత్రంతో అభిమానులను ఫిదా చేయనున్నాడు. అనంతరం పది జట్ల కెప్టెన్లు ట్రోఫీని ఆవిష్కరించనున్నారు. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్, నాలుగుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.
ఇవి కూడా చదవండి
Oscar Pistorius | ప్రియురాలి హత్య కేసు.. పెరోల్‌కు దరఖాస్తు చేసిన పారా ఒలింపిక్ విజేత
IPL 2023 | ఈ సీజన్లో రోహిత్ నాలుగో స్థానంలో ఆడాలి.. ఎందుకంటే..? అనిల్ కుంబ్లే
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

