IPL 2026 : ప్లే ఆఫ్స్ పరుగులో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) స్క్వాడ్‌లో మార్పులు చేసింది. గాయంతో టోర్నీ మొత్తానికి దూరమైన పేసర్ జేమీ ఓవర్టన్ (Jamie Overton) స్థానంలో యువ ఆల్‌రౌండర్‌ను తీసుకుంది. ఈ ఏడాదే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన దక్షిణాఫ్రికా కుర్రాడు డియాన్ ఫొరెస్టర్ (Dian Forrester)తో సీఎస్కే ఒప్పందం చేసుకుంది. స్క్వాడ్‌లోకి ఆహ్వానిస్తూ పోస్ట్ పెట్టింది.
లీగ్ దశ ఆఖర్లో పుంజుకొని ప్లే ఆఫ్స్‌పై గురి పెట్టిన చెన్నై సూపర్ కింగ్స్.. ఆల్‌రౌండర్ ఓవర్టన్ సేవల్ని కోల్పోయింది. గాయం కారణంగా చికిత్స కోసం అతడు స్వదేశానికి వెళ్లడంతో కొత్త కుర్రాడిని స్క్వాడ్‌లో చేర్చుకుంది సీఎస్కే. ఎడమ చేతివాటం పేసర్‌గా రాణిస్తున్న డియాన్ ఫొరెస్టర్ను రూ.75 లక్షలకు తీసుకుంది.
Official Announcement
Powering up the pride from 🇿🇦
Welcome aboard, Dian Forrester! 💛Note: Dian Forrester joins the squad in place of Jamie Overton.#WhistlePodu pic.twitter.com/cHYsZbMIUo
— Chennai Super Kings (@ChennaiIPL) May 14, 2026
ఇటీవల టీ20ల్లో బ్యాటుతో, బంతితో గొప్పగా రాణిస్తున్న డియాన్.. ఓవర్టన్ తరహాలో జట్టు విజయాల్లో భాగమవ్వాలని చెన్నై ఫ్రాంచైజీ కోరుకుంటోంది. ప్రస్తుతం చెన్నై 12 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. మే 15న లక్నో సూపర్ జెయింట్స్(LSG)ను ఓడిస్తే చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగుపడినట్టే.
పొట్టి క్రికెట్లో విశేషంగా రాణిస్తున్న డియాన్ ఫొరెస్టర్ దక్షిణాఫ్రికా క్రికెట్లో నయా సంచలనంగా మారాడు. ఆల్‌రౌండర్‌గా అదరగొడుతున్న ఈ యంగ్‌స్టర్ ఈ ఏడాది న్యూజిలాండ్ పర్యటనతో అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టాడు. స్వదేశంలో నిర్వహించే ఎస్ఏ20లో జోబర్గ్ సూపర్ కింగ్స్(JSK)కు డియాన్ ప్రాతినిధ్యం వహించాడు.
IPL franchises need to keep name of Dian Forrester in mind, he is a great potential & 25 years old. He is mature for IPL level.
Delhi Capitals should bring him to IPL as replacement of Ben Duckett in middle of this season!!pic.twitter.com/8uVamgQNYh
— Rajiv (@Rajiv1841) April 6, 2026
జేఎస్కే తరఫున ఎనిమిది మ్యాచుల్లో 165.09 స్ట్రయిక్ రేటుతో 175 రన్స్ కొట్టాడీ చిచ్చరపిడుగు. ముంబై కేప్‌టౌన్‌పై అజేయంగా 82 రన్స్‌తో దుమ్మురేపాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో రావల్పిండి జట్టుకూ ఆడిన డియాన్ ఆకట్టుకున్నాడు.