Cristiano Ronaldo | సౌదీ క్లబ్ తరఫున మొదటి ట్రోఫీ గెలిచిన రొనాల్డో
Cristiano Ronaldo : లెజెండరీ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) మరోసారి చాంపియన్ ఆటతో అదరగొట్టాడు. సౌదీ అరేబియా క్లబ్ అల్ నాసర్(Al Nassr) జట్టుకు అరబ్ క్లబ్ చాంపియన్స్ కప్(The Arab Club Championship Cup) ట్రోఫీ అందించాడు. అల్ హిలాల్ క్లబ్(Al Hilal)తో జరిగిన ఫైనల్లో రొనాల్డో రెండు గోల్స్‌తో మెరిశాడు. దాంతో, ఈ క్లబ్ తరఫున...
Cristiano Ronaldo : లెజెండరీ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) మరోసారి చాంపియన్ ఆటతో అదరగొట్టాడు. సౌదీ అరేబియా క్లబ్ అల్ నాసర్(Al Nassr) జట్టుకు అరబ్ క్లబ్ చాంపియన్స్ కప్(The Arab Club Championship Cup) ట్రోఫీ అందించాడు. అల్ హిలాల్ క్లబ్(Al Hilal)తో జరిగిన ఫైనల్లో రొనాల్డో రెండు గోల్స్‌తో మెరిశాడు. దాంతో, ఈ క్లబ్ తరఫున మొదటి ట్రోఫీ గెలిచాడు. ఈ ఏడాది తనను భారీ ధరకు కొనుగోలు చేసిన సౌదీ క్లబ్‌కు గొప్ప బహుమతి అందించాడు.
రియాద్‌లోని కింగ్ ఫహద్ స్టేడియం(King Fahd International Stadium)లో శనివారం రాత్రి అల్ హిలాల్, అల్ నాసర్ జట్ల మధ్య టైటిల్ పోరు జరిగింది. ఆట మొదలైన 71వ నిమిషంలో అల్ హిలాల్ జట్టు మొదటి గోల్ చేసింది. అయితే.. రొనాల్డో 74వ నిమిషంలో గోల్ కొట్టి స్కోర్ సమం చేశాడు. 98వ నిమిషంలో రెండో గోల్ కొట్టి జట్టుకు 2-1తో విజయాన్ని అందించాడు.
اللحظة المنتظرة لجماهير #النصر🏆✅#النصر_الهلال#كأس_الملك_سلمان_للأندية | #SSC pic.twitter.com/6nHHZeEKxr
— شركة الرياضة السعودية SSC (@ssc_sports) August 12, 2023
నిరుడు ఫిఫా వరల్డ్ కప్ తర్వాత అల్ నాసిర్ క్లబ్‌తో రొనాల్డో ఒప్పందం చేసుకున్నాడు. అయితే.. గత సీజన్లో పెద్దగా రాణించలేదు. సౌదీ ప్రో లీగ్ (Soudi Pro League)లో నాసిర్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. కానీ, ఈసారి ఈ ఫార్వర్డ్ ఆటగాడు అంచనాలను అందుకున్నాడు. ఆరు గోల్స్ చేసి జట్టు ట్రోఫీ అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.
క్రిస్టియానో రొనాల్డో

ఫుట్‌బాల్ లెజెండ్స్‌లో ఒకడైన రొనాల్డో తన అద్భుత ఆటతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈమధ్యే అతను ఇన్స్టాగ్రామ్(Instagram)లో ఏకంగా 600 మిలియన్ల ఫాలోవర్ల మార్క్ చేరుకున్నాడు. అంటే.. అతడిని 60 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. దాంతో, అత్యధిక మంది ఫాలోవర్స్ ఉన్న వ్యక్తిగా రికార్డు సృష్టించాడు.
ఇవి కూడా చదవండి
England | 2019 వరల్డ్ కప్ హీరోల కోసం ఇంగ్లండ్ ఎదురుచూపు.. ఆ ఇద్దరూ ఈసారి ఆడతారా?
Kylian Mbappe | ఎంబాపే మా క్లబ్‌ను వీడడం లేదు.. ధ్రువీకరించిన పీఎస్జీ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

