Cristiano Ronaldo | మైదానంలో అసభ్యకర ప్రవర్తన.. స్టార్ ఫుట్‌బాలర్‌పై నిషేధం
Cristiano Ronaldo : స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) భారీ షాక్ తగిలింది. మైదానంలో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు అతడిపై ఒక మ్యాచ్ నిషేధం పడింది. అంతేకాదు రూ. 2 లక్షల జరిమానా కూడా..
Cristiano Ronaldo : స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) భారీ షాక్ తగిలింది. మైదానంలో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు అతడిపై ఒక మ్యాచ్ నిషేధం పడింది. అంతేకాదు రూ. 2 లక్షల జరిమానా కూడా చెల్లించనున్నాడు. సౌదీ అరేబియా లీగ్(Saudi Arabia Legue 2023)లో భాగంగా ఫిబ్రవరి 25న అల్ నస్రీ, అల్ షాబాద్ జట్లు తలపడ్డాయి.
మ్యాచ్ సమయంలో కొందరు మెస్సీ మెస్సీ అంటూ నినాదాలు చేశారు. దాంతో, చిర్రెత్తుకొచ్చిన రొనాల్డో వాళ్లకు అసభ్యకరమైన గెశ్చర్ చూపించాడు. మెస్సీ మద్దతుదారులకు తన పురుషాంగం చూపిస్తూ ‘మీరు ఏమీ పీకలేర’నే అర్థం వచ్చేలా పోజు పెట్టాడు.
🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨
تصرف كارثي جديد من كريستيانو رونالدو ضد جمهور الشباب بعد نهاية اللقاء!
😳😳😳😳😳 pic.twitter.com/Tzt632I20p
— نواف الآسيوي 🇸🇦 (@football_ll55) February 25, 2024
దాంతో, స్టార్ ఆటగాడైన రొనాల్డో ప్రవర్తనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అల్ షాదాబ్ క్లబ్ అతడిపై సౌదీ లీగ్ క్రమశిక్షణ, ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేసింది. దాంతో, రొనాల్డోపై ఒక మ్యాచ్ నిషేధంతో పాటు 10,000 సౌదీ రియాల్‌లను జరిమానాగా విధించింది. అంతేకాదు అల్ షాబాద్ జట్టుకు 20,000 సౌదీ రియాల్స్ చెల్లించాల్సిందిగా రొనాల్డోను ఆదేశించింది.
క్రిస్టియానో రొనాల్డో

ఖతార్‌లో నిరుడు జరిగిన ఫిఫా వరల్డ్ కప్(FIFA World Cup) సమయంలోనే మాంచెస్టర్ క్లబ్ రొనాల్డోతో ఒప్పంద్దం రద్దు చేసుకుంది. దాంతో, మెగా టోర్నీ అనంతరం ఈ స్టార్ ప్లేయర్ కోసం పలు క్లబ్స్ పోటీ పడ్డాయి. అయితే.. చివరకు సౌదీ అరేబియాకు చెందిన అల్ నస్రీ క్లబ్ రికార్డు ధరకు అతడిని సొంతం చేసుకుంది. రెండున్నర ఏండ్ల కాలానికి రూ.4,400 కోట్లకు కాంట్రాక్టు కుదుర్చుకున్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
- Eagle Movie | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఒకేసారి రెండు ఓటీటీల్లోకి వస్తున్న రవితేజ ‘ఈగల్’
- NZ vs AUS 1st Test | టెస్టుల్లో గ్రీన్ తొలి సెంచరీ.. ఆలౌట్ ప్రమాదంలో ఆస్ట్రేలియా
- KTR | భట్టి గారు.. అంబేద్కర్ విదేశీ ఉపకారవేతనాలకు నిధులు విడుదలచేయండి: కేటీఆర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

