Cristiano Ronaldo | యూరప్‌లోని లగ్జరీ ఇల్లు అమ్ముతున్న రొనాల్డో.. ధర ఎంతో తెలుసా..?
పోర్చుగల్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో ప్రస్తుతం సౌదీ అరేబియాకు చెందిన అల్ నస్రీ క్లబ్‌కు ఆడుతున్న విషయం తెలిసిందే. సౌదీకి మకాం మార్చిన అతను యూరప్‌లోని తన విలాసవంతమైన ఇంటి (మాన్షన్)ని ఈమధ్యే అమ్మకానికి పెట్టాడు. సకల సౌకర్యాలు ఉన్న ఆ ఇల్లు ధర ఎంత తెలుసా.. రూ.55 కోట్లు. ఫిఫా వరల్డ్ కప్ అనంతరం అల్ నస్రీ క్లబ్ రొనాల్డోతో భారీ ధరకు కాంట్రాక్టు కుదుర్చుకుంది. రెండున్నరేళ్లకు గానూ అతడికి రూ.4400 కోట్లు ముట్టజెప్పనుంది.
Cristiano Ronaldo : పోర్చుగల్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో ప్రస్తుతం సౌదీ అరేబియాకు చెందిన అల్ నస్రీ క్లబ్‌కు ఆడుతున్న విషయం తెలిసిందే. సౌదీకి మకాం మార్చిన అతను యూరప్‌లోని తన విలాసవంతమైన ఇంటి (మాన్షన్)ని ఈమధ్యే అమ్మకానికి పెట్టాడు. సకల సౌకర్యాలు ఉన్న ఆ ఇల్లు ధర ఎంత తెలుసా.. రూ.55 కోట్లు. రొనాల్డో అమ్మకానికి పెట్టిన లగ్జరీ ఇంటిలో ఒక స్విమ్మింగ్ పూల్, అతిథి గృహాలు, సినిమా హాల్, టెన్నిస్ కోర్టులు ఉన్నాయి.
మళ్లీ యూరప్ వస్తాడా?
ప్రపంచంలోని మేటి ఫుట్‌బాలర్స్‌లో ఒకడైన రొనాల్డో తన కెరీర్లో యూరప్‌లోని పాపులర్ క్లబ్స్‌కు ఆడాడు. వాటిలో మాంచెస్టర్ యునైటడె, రియల్ మాడ్రిడ్, జువెంటస్ క్లబ్స్ ముఖ్యమైనవి. ముఖ్యమైన విషయం ఏంటంటే.. అల్ నస్రీ క్లబ్‌తో 2025 నాటికి రొనాల్డో అగ్రిమెంట్ పూర్తవుతుంది. అప్పటికి అతనికి 40 ఏళ్లు వస్తాయి. అప్పుడు మళ్లీ అతను యూరప్ తిరిగి వస్తాడా? ఫుట్‌బాల్ ఆడతాడా? అనేది ప్రశ్నార్థకం.
భారీ ధరకు కాంట్రాక్టు
ప్రస్తుతం రొనాల్డో తన గర్ల్‌ఫ్రెండ్ జార్జినా రోడ్రిగ్, పిల్లలతో కలిసి సౌదీ అరేబియాలో ఉంటున్నాడు. పోయిన ఏడాది ఖతర్‌లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ అనంతరం అల్ నస్రీ క్లబ్ రొనాల్డోతో భారీ ధరకు కాంట్రాక్టు కుదుర్చుకుంది. రెండున్నరేళ్లకు గానూ అతడికి రూ.4400 కోట్లు ముట్టజెప్పనుంది. దాంతో, ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందుతున్న ఫుట్‌బాలర్‌గా ఈ స్టార్ ప్లేయర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే.. ఎన్నో ఆశలతో రొనాల్డోను కొనుగోలు చేసిన అల్ నస్రీకి మొదట్లో నిరాశే ఎదురైంది. తొలి మ్యాచ్‌లో ఈ స్టార్ ప్లేయర్ ఒక్క గోల్ కూడా చేయలేదు. తనపై సౌదీ క్లబ్ పెట్టుకున్న అంచనాలు అందుకోవడంలో విఫలయం అయ్యాడు. అయితే.. ఆ తర్వాతి మ్యాచుల్లో సత్తా చాటాడు. అల్ వహేద ఫుట్‌బాల్ క్లబ్‌పై నాలుగు గోల్స్ చేసి జట్టును గెలిపించాడు.
ఇవి కూడా చదవండి
Sachin Tendulkar | అన్వర్ రికార్డు సచిన్ బద్ధలు కొట్టి 13 ఏళ్లు.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ
Mumbai Indians | ముంబై ఇండియన్స్ డబ్ల్యూపీఎల్ జెర్సీ విడుదల.. వావ్ సూపర్ అంటున్న ఫ్యాన్స్
Harry Brook: వినోద్ కాంబ్లీ రికార్డు బ్రేక్ చేసిన హ్యారీ బ్రూక్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveen Kumar | మేడిగడ్డపై ఫిర్యాదు చేసి మూడేండ్లు గడిచినా పట్టించుకోవడం లేదు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Heavy traffic jam | హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
Rashmika | విజయ్ దేవరకొండ ఇంకా నల్లపూసలు కొనివ్వలేదు.. రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు!
Sambarala Yeti Gattu | ‘సంబరాల ఏటి గట్టు’ రిలీజ్ డేట్ వివాదం.. నిర్మాతకు ఫోన్ చేసి వార్నింగ్!
Ramayana | ‘రామాయణ’ను 3డీలోనే చూడండి.. ప్రేక్షకులకు సాయిపల్లవి ప్రత్యేక విజ్ఞప్తి!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

