సెవిలా: పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో భావోద్వేగానికి లోనయ్యాడు. యూరో 2020 నుంచి పోర్చుగల్ అనూహ్య రీతిలో వైదొలగడం అతన్ని షాక్‌కు గురి చేసింది. ఆదివారం రాత్రి జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో పోర్చుగల్‌పై 1-0తో గెలిచింది బెల్జియం. 42వ నిమిషంలో థోర్గాన్ హజార్డ్ చేసిన గోల్‌తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన బెల్జియం.. తర్వాత ప్రత్యర్థికి సమం చేసే అవకాశం ఇవ్వలేదు. దీంతో మ్యాచ్ ముగియగానే రొనాల్డో అసహనంతో తన ఆర్మ్‌బ్యాండ్‌ను నేలకేసి కొట్టాడు. తన చివరి యూరోకప్‌లో ఆడిన రొనాల్డోకు ప్రిక్వార్టర్స్‌లోనే టీమ్ ఇంటిదారి పట్టడం మింగుడు పడలేదు.
నిజానికి ఈ టోర్నీలో అతడు టాప్ ఫామ్‌లో ఉన్నాడు. ప్రిక్వార్టర్స్‌కు ముందు 3 మ్యాచ్‌లలో 5 గోల్స్ చేశాడు. ఈ గోల్స్‌తో అత్యధిక అంతర్జాతీయ గోల్స్ చేసిన రికార్డు సమం చేయడంతోపాటు యూరోలో అత్యధిక గోల్స్ రికార్డు కూడా రొనాల్డో సొంతం చేసుకున్నాడు. అయితే ప్రిక్వార్టర్స్‌లో మాత్రం అతడు గోల్ చేయడంలో విఫలమవడంతో పోర్చుగల్‌కు ఓటమి తప్పలేదు.
Lukaku: You are the goat and the best in history ,The Euro lost you
— Mou (@EngMourinho) June 27, 2021
Cristiano Ronaldo: I know#BELPOR #Por pic.twitter.com/h3eHRDnIEs