Cristiano Ronaldo | కోటీశ్వరుల ద్వీపంలో దిగ్గజ ఫుట్‌బాలర్.. దుబాయ్‌లో భారీ భవంతి కొన్న రొనాల్డో
Cristiano Ronaldo : పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) వయసు పెరిగిన కొద్దీ మైదానంలో గోల్స్ వర్షం కురిపిస్తున్నాడు. సౌదీ ప్రో లీగ్(Soudi Pro Legue)లో రెచ్చిపోయి ఆడుతున్న ఈ ఫార్వర్డ్ ఆటగాడు తాజాగా దుబాయ్‌లో ఓ భారీ భవంతిని..
Cristiano Ronaldo : పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) వయసు పెరిగిన కొద్దీ మైదానంలో గోల్స్ వర్షం కురిపిస్తున్నాడు. సౌదీ ప్రో లీగ్(Soudi Pro Legue)లో రెచ్చిపోయి ఆడుతున్న ఈ ఫార్వర్డ్ ఆటగాడు 2023లో అత్యధికంగా 54 గోల్స్‌తో మారడోనా అవార్డు(Maradon Award)కు ఎంపికయ్యాడ. ఈ స్టార్ ప్లేయర్ తాజాగా దుబాయ్‌లో ఓ భారీ భవంతిని కొన్నాడు. అది కూడా కోటీశ్వరుల ద్వీపంగా పేరొందిన దుబాయ్‌లోని జుమేరాహ్ బే ద్వీపం(Jumeerah Bay Islnd)లో.
బిలియనీర్లు నివసించే గేటెడ్ కమ్యూనిటీలో ఒకటైన అయిన ఈ భవనంలో సకల సౌర్యాలు ఉన్నాయి. 30 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న భవంతిలో పలు రెస్టారెంట్లు, పడవల క్లబ్‌తో పాటు ఒక బీచ్ రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, కార్ల కోసం పెద్ద షో రూమ్ కూడా ఉన్నట్టు సమాచారం. ఈ భవనం కోసం రొనాల్డో భారీగానే ఖర్చు చేశాడట. ఈ ఏడాదిలోనూ రొనాల్డో ఈ భవనంలోకి మకాం మార్చనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

జనవరి 19న జరిగే దుబాయ్ గ్లోబ్ సాకర్ అవార్డ్స్(Dubai Globe Soccer Awards) పండుగలో రొనాల్డో మారడోనా అవార్డు అందుకోనున్నాడు. 38 ఏండ్ల రొనాల్డో59 మ్యాచుల్లోనే 54 గోల్స్ సాధించాడు. ఈ స్టార్ ప్లేయర్ ఈ గతంలో ఐదు పర్యాయాలు టాప్ గోల్ స్కోరర్‌గా నిలిచాడు. 2011, 2013, 2014, 2015లో రొనాల్డో అత్యధిక గోల్స్ సాధించాడు.

ఖతార్‌లో నిరుడు జరిగిన ఫిఫా వరల్డ్ కప్(FIFA World Cup) సమయంలోనే మాంచెస్టర్ క్లబ్ రొనాల్డోతో ఒప్పంద్దం రద్దు చేసుకుంది. దాంతో, మెగా టోర్నీ అనంతరం ఈ స్టార్ ప్లేయర్ కోసం పలు క్లబ్స్ పోటీ పడ్డాయి. అయితే.. చివరకు సౌదీ అరేబియాకు చెందిన అల్ నస్రీ క్లబ్ రికార్డు ధరకు అతడిని సొంతం చేసుకుంది. రెండున్నర ఏండ్ల కాలానికి రూ.4,400 కోట్లకు కాంట్రాక్టు కుదుర్చుకున్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
- Vizag MP | వైజాగ్ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ సతీమణి?
- Guntur Kaaram Movie | మహేష్ బాబు ఫ్యాన్స్‌కు బిగ్ అప్డేట్.. నేడే గుంటూరు కారం ట్రైలర్
- Ravindra Jadeja | ఎండ్లబండి నడిపిన టీమిండియా ఆల్‌రౌండర్.. వీడియో వైరల్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

