లండన్ : ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న భారత క్రికెట్ జట్టు.. బ్రిటీష్ గడ్డపైనే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. భారతదేశం 75 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా లండన్‌లో ఉన్న టీమిండియా జెండా పండుగను (Cricketers Flag hoisting) అక్కడే చేసుకున్నది. తాము బస చేసిన హోటల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారత జెండాను క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ రవిశాస్త్రి ఎగురవేశారు. అనంతరం టీమ్ మేట్లతో కలిసి ‘జన గణ మణ అధినాయక జయహే’ అంటూ జాతీయ గీతం ఆలపించారు. ఈ కార్యక్రమంలో జట్టు సభ్యులు, వారి కుటుంబసభ్యులతోపాటు ఇతర సిబ్బంది కూడా పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచే లార్డ్స్ మైదానానికి బయల్దేరి వెళ్లారు.
విదేశీ పర్యటనల్లో ఉన్న సమయాల్లో భారతీయ క్రికెటర్లు సాధారణంగా ఇంటి నుంచే ఎక్కువ సమయం గడుపుతారు. చాలా తరచుగా జాతీయ పండుగల్లో పాలుపంచుకుంటారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో గత వారం ఇంగ్లండ్‌కు బయల్దేరిన బ్యాట్స్మెన్లు ప్రుథ్వీషా, సుర్యకుమార్ యాదవ్ కూడా కనిపించారు. వీరు తమ ఐసోలేషన్ పీరియడ్‌ను పూర్తిచేసుకుని జట్టుతో కలిసి ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే 3 వ టెస్ట్ సెలెక్షన్స్ కోసం అందుబాటులో ఉన్నారు.
టీమిండియా జట్టు సభ్యులు విదేశీ పర్యటనలో ఉండగా.. భారత ఒలింపియన్లు ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవానికి హాజరయ్యారు. ప్రసంగం ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్రమోదీ వారిని కలిసి అభినందించారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం సాయంత్రం ఒలింపియన్లకు ఆతిథ్యం ఇచ్చారు. కాగా, ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రా స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ రోజు చారిత్రాత్మక ఎర్ర కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరు కావడం నాకు గౌరవంగా ఉన్నది. అథ్లెట్‌గా, సైనికుడిగా నా హృదయం ఉద్వేగంతో నిండిపోయింది. జై హింద్’ అని ట్విట్టర్లో రాశారు.
On the occasion of India's Independence Day, #TeamIndia members came together to hoist the flag 🇮🇳 🙌 pic.twitter.com/TuypNY5hjU
— BCCI (@BCCI) August 15, 2021
సాలీడు విషంతో గుండెపోటుకు చికిత్స : ఆస్ట్రేలియా పరిశోధన
ఢిల్లీలోని హోటల్లో మంటలు.. ఇద్దరు మృతి
ఎన్సీసీ క్యాడెట్ల మనుసు దోచిన మోదీ
ఇండియన్స్‌కు జో బైడెన్ విషెస్
శ్రీనగర్‌లో 100 అడుగుల త్రివర్ణ పతాకం
నెహ్రూ తొలి చారిత్రాత్మక ప్రసంగం
ఈ గోల్డ్ మెడలిస్ట్ కష్టాలు తీరెదెలా..?
పనుల్లో బిజీగా ఉన్నారా? ఈ ఆహారాలతో ఆరోగ్యం పొందండి!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..