CPL T10 | టీ20కి పోటీగా టీ10.. ఆగస్టులో ప్రారంభం.. ఆసక్తికరంగా కొత్త ఫార్మాట్ నిబంధనలు
ప్రపంచ క్రికెట్ లో పాగా వేయడానికి మరో ఫార్మాట్ దూసుకొస్తున్నది. టెస్టు, వన్డే లను మింగిన టీ20ని సవాల్ చేస్తూ 60 బంతుల (టీ10) ఫార్మాట్ కూడా ప్రాచుర్యం పొందుతున్నది. ఇప్పటికే అబుదాబిలో ఈ ఫార్మాట్ కు అంకురార్పణ చేయగా తాజాగా కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) లో ఈ ఏడాది నుంచే దీనికి ముహుర్తం ఖరారు చేశారు. టెస్టు, పరిమిత ఓవర్లతో పోలిస్తే ఇందులో నిబంధనలు కాస్త వెరైటీగా ఉన్నాయి. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో రాబోతున్న ఈ నయా క్రికెట్ ఫార్మాట్, ఇందులోని నిబంధనల గురించి ఇక్కడ చూద్దాం.
సీపీఎల్-10వ ఎడిషన్ (ఆగస్టు 30-సెప్టెంబర్ 30) ప్రారంభానికి ముందే నిర్వాహకులు టీ10 ని ప్రారంభించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ‘The 6ixty’ లీగ్ గా వస్తున్న ఈ నయా ఫార్మాట్ 2022 ఆగస్టు 24 నుంచి 28 వరకు వెస్టిండీస్ దీవులలో జరుగనుంది. సెయింట్ కిట్స్ వేదికగా జరుగబోయే ఈ నయా ఫార్మాట్ లో సీపీఎల్ లో ఆడే 6 పురుషుల జట్లు, 3 మహిళల జట్లు ఆడతాయి. ఈ బ్రాండ్ న్యూ టోర్నీకి యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనుండటం గమనార్హం.
‘ది సిక్స్టీ’ ఫార్మాట్ మార్గదర్శకాలు :
– ఈ ఫార్మాట్ లో ప్రతి జట్టు ఆడేది పది ఓవర్లు మాత్రమే.
– సాధారణ క్రికెట్ లో మాదిరిగా పది మంది కాకుండా ఈ ఫార్మాట్ లో బ్యాటింగ్ చేసేది ఆరుగురే.
– టీ20ల మాదిరే ఇందులో కూడా రెండు పవర్ ప్లే (రెండు ఓవర్లకు ఒకటి) ఉంటాయి. అయితే బ్యాటింగ్ చేసే జట్టు తొలి ఓవర్లో రెండు సిక్సర్లు కొడితే మూడో పవర్ ప్లే ను కూడా ఆడే అవకాశముంది.
– ఐదు ఓవర్ల వరకు ఫీల్డింగ్ మార్పులు లేకుండా ఒకే ఎండ్ నుంచి బౌలింగ్ చేయొచ్చు.
– 45 నిమిషాల నిడివిలో బౌలింగ్ జట్టు పది ఓవర్లు వేయకుంటే ఆ టీమ్ వేసే చివరి ఓవర్లో ఓ ఫీల్డర్ ను తీసేస్తారు. అంటే పది మందే గ్రౌండ్ లో ఉంటారు.
– యాప్, వెబ్ సైట్ ద్వారా లాగిన్ అయి మ్యాచ్ చూసే ప్రేక్షకులు ప్రతి ఇన్నింగ్స్ లో ఓ జట్టుకు ఓటింగ్ ద్వారా ‘మిస్టరీ ఫ్రీ హిట్’ అందించొచ్చు.
60 balls, 6 men’s teams, 3 women’s teams, radical new rules. Join us as we see the CPL teams compete in @6ixtycricket #CricketsPowerGame #6ixtyCricket #CPL22 https://t.co/i8TGhUFafz
— CPL T20 (@CPL) June 22, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

