Chris Jordan | పుట్టిన గడ్డపై ‘హ్యాట్రిక్’.. చరిత్ర సృష్టించిన జోర్డాన్
Chris Jordan : కరీబియన్ గడ్డపై జన్మించిన ఇంగ్లండ్ పేసర్ క్రిస్ జోర్డాన్ (Chris Jordan) అదే నేలపై చరిత్ర సృష్టించాడు. పొట్టి ప్రపంచ కప్‌లో హ్యాట్రిక్ (Hat-trick) తీసిన తొలి ఇంగ్లీష్ బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు.
Chris Jordan : కరీబియన్ గడ్డపై జన్మించిన ఇంగ్లండ్ పేసర్ క్రిస్ జోర్డాన్(Chris Jordan) అదే నేలపై చరిత్ర సృష్టించాడు. పొట్టి ప్రపంచ కప్‌లో హ్యాట్రిక్(Hat-trick) తీసిన తొలి ఇంగ్లీష్ బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. అమెరికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో జోర్డాన్ వరుస బంతుల్లో అలీ ఖాన్(0), నోస్తుశ్(0), నేత్రావల్కర్(0)లను బౌల్డ్ చేశాడు. దాంతో, తొమ్మిదో సీజన్లో ప్యాట్ కమిన్స్(Pat Cummins) తర్వాత ఈ ఫీట్ సాధించిన రెండో బౌలర్‌గా మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. వీళ్లిద్దరూ కూడా సూపర్ 8 దశలోనే హ్యాట్రిక్ వీరులుగా నిలవడం విశేషం.
ఆస్ట్రేలియా పేసర్ కమిన్స్ వరుసగా రెండు మ్యాచుల్లో హ్యాట్రిక్ నమోదు చేశాడు. తొలుత బంగ్లాదేశ్‌పై మూడు వికెట్లతో చెలరేగిన ఈ స్పీడ్‌స్టర్.. జూన్ 23న అఫ్గనిస్థాన్‌పై మళ్లీ అదే ఫీట్ రిపీట్ చేశాడు. దాంతో, పొట్టి ప్రపంచకప్‌లో రెండు హ్యాట్రిక్‌లు తీసిన రెండో బౌలర్‌గా వసీం అక్రమ్(Wasim Akram) రికార్డును కమిన్స్ బద్ధలు కొట్టేశాడు. ఈ మెగాటోర్నీలో హ్యాట్రిక్ తీసిన వాళ్ల జాబితాలో క్రిస్ జోర్డాన్ చేరాడు. బార్బడోస్‌లో పుట్టిన జోర్డాన్.. ఇప్పుడు అదే గడ్డ మీద అరుదైన ఘనత సొంతం చేసుకోవడం గమనార్హం.
HAT-TRICK! 🎉🎉🎉
Incredible from Chris Jordan! 🤯
Bowled. LBW. Bowled. pic.twitter.com/dKn9aN5GM6
— England Cricket (@englandcricket) June 23, 2024
ఏకంగా 8 మంది
ఇప్పటివరకూ టీ20 వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ తీసిన బౌలర్లు ఎనిమిది మంది. ఆరంభ ఎడిషన్‌లోనే ఆస్ట్రేలియా స్పీడ్‌స్టర్ బ్రెట్ లీ(Brett Lee) బంగ్లాదేశ్‌పై హ్యాట్రిక్ తీశాడు. ఆ తర్వాత కర్టిస్ కాఫర్(ఐర్లాండ్), వనిందు హసరంగ (శ్రీలంక), కగిసో రబడ(దక్షిణాఫ్రికా), కార్తిక్ మెయియప్పన్(యూఏఈ) జోష్ లిటిల్(ఐర్లాండ్), ప్యాట్ కమిన్స్ (అస్ట్రేలియా), క్రిస్ జోర్డాన్(ఇంగ్లండ్)లు ఈ క్లబ్లో చోటు సంపాదింంచారు.
Watch: Pat Cummins’ historic milestone of back-to-back Men’s #T20WorldCup hat-trick 🎥
All his hat-trick wickets ⬇#AFGvAUShttps://t.co/DrYR7duJ7t
— ICC (@ICC) June 23, 2024
ఇవి కూడా చదవండి
- Fire Breaks Out | స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం
- DNA test for tribals | గిరిజనులకు డీఎన్ఏ పరీక్ష చేయిస్తామన్న బీజేపీ మంత్రి.. ఆయన రాజీనామాకు డిమాండ్
- Deputy CM Pawan Kalyan | పవన్ కల్యాణ్‌ను కలువనున్న టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

