DNA test for tribals | గిరిజనులకు డీఎన్ఏ పరీక్ష చేయిస్తామన్న బీజేపీ మంత్రి.. ఆయన రాజీనామాకు డిమాండ్
DNA test for tribals | గిరిజనులను హిందువులుగా నిర్ధారించేందుకు డీఎన్ఏ పరీక్ష చేయిస్తామని బీజేపీ మంత్రి అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. కాంగ్రెస్, ఆదివాసీ పార్టీలు ఆయనపై మండిపడ్డాయి. బీజేపీ మంత్రి రాజీనామాకు డిమాండ్ చేశాయి.
జైపూర్: గిరిజనులను హిందువులుగా నిర్ధారించేందుకు డీఎన్ఏ పరీక్ష చేయిస్తామని బీజేపీ మంత్రి అన్నారు. (DNA test for tribals) ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. కాంగ్రెస్, ఆదివాసీ పార్టీలు ఆయనపై మండిపడ్డాయి. బీజేపీ మంత్రి రాజీనామాకు డిమాండ్ చేశాయి. రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి, కోటాలోని రామ్‌గంజ్ మండికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే మదన్ దిలావర్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన గిరిజనులు హిందువులు కాదంటూ భారతీయ ఆదివాసీ పార్టీ (బీఏపీ) సభ్యులు చేసిన ఆరోపణలపై స్పందించారు. గిరిజనులు హిందువులా? కాదా? అన్నది వారి పూర్వీకులను అడుగుతామని అన్నారు. ‘వంశవృక్షాన్ని నమోదు చేసేందుకు వారిని (గిరిజనులను) సంప్రదిస్తాం. వారు హిందువులు కాకపోతే, వారి పిల్లలకు తండ్రులా కాదా అని నిర్ధారించడానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తాం’ అని అన్నారు.
కాగా, మంత్రి మదన్ దిలావర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బన్స్వారా ఎంపీ రాజ్‌కుమార్ రోట్ మండిపడ్డారు. డీఎన్ఏ పరీక్ష కోసం గిరిజనులు తమ రక్త నమూనాలను దిలావర్, రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మకు పంపాలని కోరుతూ ప్రచారాన్ని ప్రారంభిస్తామని అన్నారు. గిరిజన సమాజాన్ని అవమానించిన ఆయన క్షమాపణ చెప్పాలని, మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతస్రా కూడా మంత్రి మదన్ దిలావర్ వ్యాఖ్యలను ఖండించారు. ఆయనను మానసిక రోగిగా అభివర్ణించారు. దిలావర్ ప్రకటన ఆయన మేధో అసమర్థతను తెలియజేస్తున్నదని విమర్శించారు.
కాగా, ప్రతాప్‌గఢ్‌లో ఆదివాసీ యువమోర్చా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బీజేపీ మంత్రి మదన్ దిలావర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

