CSK | పన్నెండోసారి ప్లే ఆఫ్స్ చేరిన ధోనీసేన.. రెండో స్థానంతో లీగ్ దశ ముగించిన చెన్నై
ఐపీఎల్లో మరే జట్టుకు సాధ్యంకాని రీతిలో చెన్నై సూపర్ కింగ్స్ పన్నెండోసారి ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఇప్పటి వరకు 16 సీజన్లు జరుగగా.. అందులో చెన్నై కేవలం రెండింట్లో మాత్రమే లీగ్ దశకు పరిమితమైంది. మరో రెండు సీజన్లు నిషేధం కారణంగా సీఎస్కే బరిలోకి దిగలేదు.
- మెరిసిన రుతురాజ్, కాన్వే
CSK | ఐపీఎల్లో మరే జట్టుకు సాధ్యంకాని రీతిలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పన్నెండోసారి ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఇప్పటి వరకు 16 సీజన్లు జరుగగా.. అందులో చెన్నై కేవలం రెండింట్లో మాత్రమే లీగ్ దశకు పరిమితమైంది. మరో రెండు సీజన్లు నిషేధం కారణంగా సీఎస్కే బరిలోకి దిగలేదు. టాప్-2లో నిలువాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో ధోనీసేన దుమ్మురేపింది. రుతురాజ్, కాన్వే అదరగొట్టడంతో మొదట భారీ స్కోరు చేసిన చెన్నై.. ఆనక ఢిల్లీని తమ పకడ్బందీ బౌలింగ్‌తో ఉక్కిరిబిక్కిరి చేసింది.
న్యూఢిల్లీ: ఆల్‌రౌండ్ ప్రతిభ కనబర్చిన చెన్నై.. ఐపీఎల్ 16వ సీజన్లో ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఆదివారం ఇక్కడ జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ధోనీ సేన 77 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. ఓపెనర్లు కాన్వే (52 బంతుల్లో 87; 11 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (50 బంతుల్లో 79; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకోగా.. శివమ్ దూబే (22; 3 సిక్సర్లు) జడేజా (20 నాటౌట్; 3 ఫోర్లు, ఒక సిక్సర్) వేగంగా ఆడారు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్, నోర్జే, సకారియా తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (58 బంతుల్లో 86; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. పృథ్వీ షా (5), ఫిల్ సాల్ట్ (3), రాసో (0), యష్ ధుల్ (13), అక్షర్ (15), అమన్ (7), లలిత్ (6) విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ 3, తీక్షణ, పతిరణ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. రుతురాజ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఆదివారం జరుగనున్న డబుల్ హెడర్‌లో ముంబైతో హైదరాబాద్, గుజరాత్‌తో బెంగళూరు తలపడనున్నాయి.
టాప్-2లో చెన్నై
లీగ్ దశ ముగిసేసరికి 14 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో 17 పాయింట్లు ఖాతాలో వేసుకున్న చెన్నై.. పట్టికలో రెండో స్థానంలో నిలిచి క్వాలిఫయర్-1కు అర్హత సాధించింది. తద్వారా ఫైనల్ చేరేందుకు ధోనీ సేనకు అదనపు అవకాశం దక్కినైట్లెంది. పట్టికలో గుజరాత్ టాప్‌లో ఉండగా.. ఈ రెండు జట్ల మధ్య మంగళవారం చెన్నై వేదికగా తొలి క్వాలిఫయర్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు నేరుగా ఫైనల్ చేరనుండగా.. ఓడిన జట్టు ఎలిమినేటర్ విజేతతో క్వాలిఫయర్-2 ఆడనుంది.
సంక్షిప్త స్కోర్లు
చెన్నై: 223/3 (కాన్వే 87, రుతురాజ్ 79; చేతన్ 1/36), ఢిల్లీ: 146/9 (వార్నర్ 86, అక్షర్ 15; దీపక్ 3/22, పతిరణ 2/22).
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

