FIFA Worldcup: ఆతిథ్య అమెరికాకు ఓటమి.. క్వార్టర్స్లోకి ప్రవేశించిన బెల్జియం
FIFA World Cup: ఫిఫా వరల్డ్కప్లో ఆతిథ్య జట్ల పోరు ముగిసింది. టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న అమెరికా .. రౌండ్16 మ్యాచ్లో ఓటమి పాలైంది. బెల్జియం 4-1 గోల్స్ తేడాతో అమెరికాను ఓడించి క్వార్టర్స్లోకి ప్రవేశించింది.
సియాటెల్: ఫిఫా వరల్డ్కప్(FIFA World Cup)లో ఆతిథ్య జట్ల పోరు ముగిసింది. టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న అమెరికా .. రౌండ్16 మ్యాచ్లో ఓటమి పాలైంది. బెల్జియం 4-1 గోల్స్ తేడాతో అమెరికాను ఓడించి క్వార్టర్స్లోకి ప్రవేశించింది. బెల్జియం ప్లేయర్ చార్లెస్ డీ కెటిలేరి రెండో గోల్స్ చేశాడు. ఈ మ్యాచ్లో అమెరికా డిఫెన్స్ బలహీనత బయటపడింది. బెల్జియం దూకుడును ఏమాత్రం అమెరికా డిఫెండర్లు అడ్డుకోలేకపోయారు. అమెరికా ఫార్వర్డ్ ప్లేయర్ ఫొలారిన్ బలోగన్ ఈ మ్యాచ్లో ఆడాడు. ట్రంప్ జోక్యంతో అతనిపై ఓ మ్యాచ్ సస్పెన్షన్ను ఫిఫా రద్దు చేసిన విషయం తెలిసిందే. వివాదాస్పద రీతిలో బలోగన్ను ఆడించారు. అయినా కానీ అమెరికాకు ఆ అంశం కలిసిరాలేదు. బెల్జియం తరపున డీ కెలిటేరి 9, 33 నిమిషాల్లో, వానకేన్ 57వ నిమిషంలో, లుకాకు 93వ నిమిషంలో గోల్ చేశాడు. ఇక అమెరికా తరపున టిల్మాన్ 31వ నిమిషంలో గోల్ చేశాడు. బెల్జియంతో మ్యాచ్లో మరీ పేలవంగా అమెరికా ఆడినట్లు ఫుట్బాల్ నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చిన మెక్సికో, కెనడా, అమెరికా దేశాలు ఈ టోర్నీ నుంచి ఔటయ్యాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

