Carlos Alcaraz | వింబుల్డన్ విజేతకు ఏటీపీ అవార్డు.. అరుదైన క్లబ్లో స్పెయిన్ యువకెరటం
Carlos Alcaraz : రెండో సీడ్ కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz) ప్రతిష్ఠాత్మక ఏటీపీ అవార్డు గెలుచుకున్నాడు. ఈ ఏడాది అద్భుతంగా రాణించిందుకు స్టెఫాన్ ఎడ్బెర్గ్ స్పోర్ట్స్‌మన్‌షిప్(Stefan Edberg Sportsmanship Award) అవార్డు అందుకున్నాడు. జన్నిక్ సిన్నర్(Jannik Sinner)...
Carlos Alcaraz : రెండో సీడ్ కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz) ప్రతిష్ఠాత్మక ఏటీపీ అవార్డు గెలుచుకున్నాడు. ఈ ఏడాది అద్భుతంగా రాణించిందుకు స్టెఫాన్ ఎడ్బెర్గ్ స్పోర్ట్స్‌మన్‌షిప్(Stefan Edberg Sportsmanship Award) అవార్డు అందుకొని అరుదైన క్లబ్లో చేరాడు. జన్నిక్ సిన్నర్(Jannik Sinner), హుబర్ట్ హుర్కాజ్, గ్రిగర్ దిమిత్రోవ్లను వెనక్కి నెట్టి మరీ విజేతగా నిలిచాడు. తద్వారా ఈ అవార్డు గెలిచిన నాలుగో స్పెయిన్ ఆటగాడిగా అల్కరాజ్ గుర్తింపు సాధించాడు.
అల్కరాజ్ కంటే ముందు జోస్ హిఘెరాస్, అలెక్స్ కొర్రెట్జా, రఫెల్ నాదల్(Rafeal Nadal) మాత్రమే స్టెఫాన్ ఎడ్బెర్గ్ స్పోర్ట్స్‌మన్‌షిప్ అవార్డు అందుకున్నారు. వీళ్లలో నాదల్ ఒక్కడే రికార్డు స్థాయిలో ఐదుసార్లు ఈ అవార్డును ముద్దాడాడు. రఫా 2010, 2018, 2019, 2020, 2021లో స్టెఫాన్ ఎడ్బెర్గ్ స్పోర్ట్స్‌మన్‌షిప్ అవార్డు గెలుచుకున్నాడు.
కార్లోస్ అల్కరాజ్

‘స్టెఫాన్ ఎడ్బెర్గ్ స్పోర్ట్స్‌మన్‌షిప్ అవార్డు గెలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా సమకాలీనులతో పోటీపడి అవార్డు దక్కించుకున్నందకు ఎంతో గర్వంగా అనిపిస్తోంది. ఇది నాకు చాలా విలువైనది. ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా’ అని అల్కరాజ్ తెలిపాడు.
అల్కరాజ్, నొవాక్ జకోవిచ్

ఈ ఏడాది అల్కరాజ్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఆరు టైటిళ్లు గెలవడమే కాకుండా వరల్డ్ నంబర్ 1 ర్యాంకుకు ఎగబాకాడు. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో నొవాక్ జకోవిచ్(Novak Djokovic) చేతిలో కంగుతిన్న అల్కరాజ్.. వింబుల్డన్ ఫైనల్లో జకోను మట్టికరిపించాడు. అయితే.. యూఎస్ ఓపెన్‌లో ఓటమితో అతడు రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. 2023 ఏడాదిని విజయవంతంగా ముగించిన ఈ యంగ్‌స్టర్ వచ్చే ఏడాదిని విజయంతో ఆరంభించాలనే కసితో ఉన్నాడు. అందులో భాగంగా అల్కరాజ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్నాడు.
ఇవి కూడా చదవండి
INDvsSA: శ్రేయస్ వన్డేలైనా ఆడతాడా..? కీలక అప్డేట్ ఇచ్చిన బీసీసీఐ
Ben Stokes | భారత పర్యటనకు సిద్ధమవుతున్న స్టోక్స్.. వర్కవుట్స్ స్పీడ్ పెంచేశాడు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

