Ben Stokes : ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్(Ben Stokes) మోకాలి సర్జరీ(Knee Surgery) నుంచి కోలుకుంటున్నాడు. ప్రస్తుతం రిహాబిలిటేషన్(Rehabilitation)లో ఉన్న అతడు తన ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు. ఇన్స్టాగ్రామ్ వేదికగా స్టోక్స్ ఒక వీడియో పోస్ట్ పెట్టాడు. అందులో ఈ స్టార్ బ్యాటర్ ఈజీ వర్కవుట్స్ చేస్తున్నాడు.
‘మొదటి రెండు వారాలు మోకాలి వాపును తగ్గించేందుకు ఐస్ పెట్టడానికే సరిపోయింది. నా మోకాలిని సిద్ధం చేసేందుకు కొన్ని తేలికపాటి వ్యాయామాలు చేస్తున్నా. జిమ్‌లో మళ్లీ వర్కవుట్స్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరో రెండు వారాల్లో మరింత మెరుగుపడతాను’ అంటూ స్టోక్స్ క్యాప్షన్ రాసుకొచ్చాడు.
భారత గడ్డపై వన్డే వరల్డ్ కప్ ముగిసిన పది రోజులకు స్టోక్స్ ఎడమ మోకాలికి సర్జరీ జరిగింది. 2019 ప్రపంచ కప్ తర్వాత పూర్తిగా టెస్టులపైనే దృష్టి పెట్టిన స్టోక్స్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే.. వరల్డ్ కప్ ముందు హెడ్‌కోచ్, కెప్టెన్ జోస్ బట్లర్ అభ్యర్థనతో 50 ఓవర్ల ఆటలో పునరగామనం చేశాడు.
బెన్ స్టోక్స్
వచ్చే ఏడాది జనవరిలో బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లండ్ బృందం భారత్‌కు రానుంది. ఇరుజట్లు ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడనున్నాయి. తొలి టెస్టు జనవరి 25న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగనుంది. వైజాగ్‌లో ఫిబ్రవరి 2న రెండో టెస్టు, రాజ్‌కోట్‌లో ఫిబ్రవరి 15న మూడో టెస్టు, రాంచీలో ఫిబ్రవరి 23న నాలుగో టెస్టు, ధర్మశాలలో మార్చి 7న నాలుగో టెస్టు నిర్వహించనున్నారు.
Mumbai Indians: రోహిత్ కెప్టెన్సీ తొలగింపు ఎఫెక్ట్.. ఆ విషయంలో ముంబైని అధిగమించిన చెన్నై
AUS vs PAK | తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ ఆలౌట్.. భారీ ఆధిక్యంలో ఆస్ట్రేలియా