న్యూయార్క్: యూఎస్ ఓపెన్‌లో సంచలనం నమోదు అయ్యింది. స్పెయిన్ క్రీడాకారుడు కార్లోస్ అల్కరాజ్.. రెండో రౌండ్లో ఓటమి పాలయ్యాడు. డచ్ ప్లేయర్ బోటిక్ వాన్ డీ జాండ్స్కల్ప్ చేతిలో 6-1, 7-5, 6-4 స్కోరు తేడాతో అల్కరాజ్ పరాజయం చవిచూశాడు. ఈ ఓటమితో ఒకే సీజన్లో ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ గెలిచే అవకాశాన్ని కోల్పోయాడు.గతంలో వరుసగా మూడు సార్లు యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్స్‌కు వెళ్లాడు. టెన్నిస్ ప్రపంచంలో బోటిక్ వాన్ కొత్త చరిత్ర క్రియేట్ చేశాడు.
టాప్ సీడ్ ప్లేయర్‌కు షాకిచ్చిన క్రీడాకారుడిగా బోటిక్ నిలిచాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో వరుసగా 15 మ్యాచ్‌లు గెలిచిన అల్కరాజ్.. 74వ ర్యాంక్ ప్లేయర్ బోటిక్ చేతిలో ఓడిపోయాడు. జూన్‌లో అల్కరాజ్ ఫ్రెంచ్ ఓపెన్ గెలిచాడు. జూలైలో వింబుల్డన్ నెగ్గిన విషయం తెలిసిందే. తాజాగా ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లోనూ మెడల్ సాధించిన అల్కరాజ్ అనూహ్య రీతిలో బోటిక్ చేతిలో ఓటమి చవిచూశాడు.
Botic van de Zandschulp just knocked Carlos Alcaraz out of the US Open! pic.twitter.com/QK3ZrkoPgx
— US Open Tennis (@usopen) August 30, 2024