ATP Finals : ఇటలీ వేదికగా జరుగుతున్న ఏటీపీ ఫైనల్లో(ATP Finals) రెండోసీడ్ కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz) అదరగొడుతున్నాడు. ఆరంగేట్రంలోనే ఈ యంగ్ సంచలనం వరుస విజయాలతో సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. శుక్రవారం హోరీహోరీగా జరిగిన మ్యాచ్‌లో యూఎస్ ఓపెన్ రన్నరప్ డానిల్ మెద్వెదేవ్(Daniil Medvedev)పై అవలీలగా గెలుపొందాడు. రెండు సెట్లలో దూకుడుగా ఆడిన అల్కరాజ్ 6-4. 6-4తో మెద్వెదేవ్‌ను చిత్తు చేశాడు. సెమీస్‌లో అతడు నొవాక్ జకోవిచ్‌ను ఢీకొట్టనున్నాడు.
‘ఏటీపీ ఫైనల్స్‌లో జకోవిచ్‌తో తలపడడం నేను ఎదుర్కోబోయే అతిపెద్ద చాలెంజ్. ఎందుకంటే.. ఏటీపీ ఫైనల్స్‌లో జకో ఇప్పటికే ఆరుసార్లు గెలిచాడు. ప్రస్తుత టెన్నిస్‌లో అతడొక గొప్ప ప్లేయర్’ అని మ్యాచ్ అనంతరం అల్కరాజ్ పేర్కొన్నాడు.
అల్కరాజ్, మెద్వెదేవ్
ఇప్పటివరకూ అల్కరాజ్, జకోవిచ్ నాలుగుసార్లు తలపడగా.. చెరో రెండుసార్లు విజయం సాధించారు. దాంతో, ఈసారి పైచేయి ఎవరిది? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్(French Open 2023) ఫైనల్లో జకో చేతిలో కంగుతిన్న అల్కరాజ్.. వింబుల్డన్‌లో గర్జించాడు. హోరాహోరీ పోరులో జకోను ఓడించి టాప్ సీడ్ సొంతం చేసుకున్నాడు. అయితే.. ఆగస్టులో జరిగిన సిన్సినాటి ఓపెన్ ఫైనల్లో జకో ప్రతీకారం తీర్చుకున్నాడు. యూఎస్ ఓపెన్ ఫైనల్లో మెద్వెదేవ్‌ను చిత్తు చేసిన జకోవిచ్ ట్రోఫీతో పాటు వరల్డ్ నంబర్ ర్యాంక్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.