బెంగళూరు: కెప్టెన్ అజయ్‌కుమార్ రెడ్డి, సునీల్ రమేశ్ సెంచరీలతో అదరగొట్టడంతో వరుసగా మూడోసారి భారత్ అంధుల జట్టు టీ20 ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 120 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. మొదట భారత్ 2 వికెట్లకు 277 రన్స్ చేసింది. రమేశ్ (63 బంతుల్లో 136*; 24 ఫోర్లు, ఒక సిక్సర్), అజయ్ (50 బంతుల్లో 100*; 18 ఫోర్లు) అదరగొట్టారు. అనంతరం బంగ్లా 20 ఓవర్లలో 3 వికెట్లకు 157 పరుగులే చేసింది.