DC vs GG : ఢిల్లీ క్యాపిటల్స్ ఒకే ఓవర్లో కీలకమైన రెండు వికెట్లు కోల్పోయింది. స్నేహ్ రానా వేసిన ఆరో ఓవర్లో ధాటిగా ఆడుతున్న అలిసే క్యాప్సే(21) రనౌట్ అయింది. రెండో బంతికి ఓపెనర్ మేగ్ లానింగ్(18) ఎల్బీగా ఔట్ అయింది. దాంతో 48 రన్స్ వద్ద ఢిల్లీ రెండో వికెట్ పడింది. జెమీమా రోడ్రిగ్స్, మరిజానే కాప్ క్రీజులో ఉన్నారు. గార్డ్నర్ వేసిన ఐదో ఓవర్లో అలిసే క్యాప్సే రెండు సిక్స్‌లు కొట్టింది. లానింగ్, క్యాప్సే రెండో వికెట్‌కు 38 పరుగులు జోడించారు. పవర్ ప్లేలో ఢిల్లీ రెండు మూడు నష్టానికి 51రన్స్ చేసింది.
148 టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ 10 రన్స్ వద్ద బిగ్ వికెట్ కోల్పోయింది. తనూజ కన్వర్ ఓవర్లో షఫాలీ వర్మ (8) బౌల్డ్ అయింది. రెండో బంతిని షఫాలీ లాంగాఫ్‌లో సిక్స్ కొట్టింది. ఐదోబంతికి షాట్ ఆడబోయింది. కానీ, బంతి షూకు తగిలి వికెట్లను గిరాటేసింది. కిమ్ గార్త్ వేసిన తొలి బంతికే లానింగ్ ఎల్బీ కోసం అప్పీలు చేశారు. రివ్యూలో నాటౌట్‌గా తేలడంతో ఆమె బతికిపోయింది.