Cameron Green | డబ్ల్యూటీసీ ఫైనల్, యాషెస్‌లో అటాకింగ్ గేమ్ ఆడతా : ఆసీస్ ఆల్‌రౌండర్
Cameron Green : ఐపీఎల్(IPL 2023) ఆరంగేట్రం సీజన్లోనే సెంచరీ కొట్టిన కామెరూన్ గ్రీన్(Cameron Green) ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. భారత్‌పై మంచి రికార్డు ఉన్న అతను ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్(WTC Final 2023)కు ముందు తన గేమ్ ప్లాన్ గురించి చెప్పాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో తన సహజసిద్దమైన....
Cameron Green : ఐపీఎల్(IPL 2023) ఆరంగేట్రం సీజన్లోనే సెంచరీ కొట్టిన కామెరూన్ గ్రీన్(Cameron Green) ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. భారత్‌పై మంచి రికార్డు ఉన్న అతను ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్(WTC Final 2023)కు ముందు తన గేమ్ ప్లాన్ గురించి చెప్పాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో తన సహజసిద్దమైన అటాకింగ్ గేమ్ ఆడతానని ఈ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ తెలిపాడు.
‘ఇంగ్లండ్‌లో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్, ఆ తర్వాత జరగబోయే యాషెస్ సిరీస్(Ashes Series)లో నా ఆటను మార్చుకోను. బౌలర్లపై ఎదురుదాడికి దిగుతా. గత ఏడాది నేను ఎక్కువగా డిఫెండ్ చేయడానికే ప్రాధాన్యం ఇచ్చాను. కానీ, ఇప్పటి నుంచి అలా కాదు. పరుగులు సాధించడంపై దృష్టి పెట్టాన’ని అతను వెల్లడించాడు. తాను పరిస్థితులకు తొందరగా అలవాటు పడేందుకు ప్రయత్నిస్తున్నానని గ్రీన్ చెప్పాడు. ఐపీఎల్ 16వ సీజన్(IPL 2023)లో భారత బౌలర్లు షమీ, సిరాజ్, జడేజా, అశ్విన్‌ను అతను సమర్దంగా ఎదుర్కొన్నాడు. దాంతో, డబ్ల్యూటీసీ ఫైనల్లో ఈ ఆరడుగుల ఆల్‌రౌండర్ ఆసీస్‌కు మిడిలార్డర్లో కీలకం కానున్నాడు.
ఐపీఎల్లో శతకం సాధించాక గ్రీన్ సంబురం

ఒక్క మ్యాచ్‌తో హీరో
ఐపీఎల్ 16వ సీజన్లో ముంబై ఇండియన్స్(Mumbai Indians)కు ఆడిన గ్రీన్ సత్తా చాటాడు. మినీ వేలంలో రూ. 17.50 కోట్ల భారీ ధర పెట్టి కొన్నందుకు ఫ్రాంచైజీకి న్యాయం చేశాడు. మొదట్లో విఫలమైన అతను ఒక్క మ్యాచ్‌తో హీరో అయ్యాడు. కీలకమైన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(Sun Risers Hyderabad)పై సెంచరీ బాదాడు. దాంతో, ముంబై అలవోకగా గెలిచి ప్లే ఆఫ్స్ చేరింది. క్వాలిఫయర్ 2లోనే గ్రీన్ గుజరాత్‌పై 41 పరుగులతో రాణించడు. దాంతో, ఫైనల్లోనే అతను అదే ఫామ్ కొనసాగించాలని భావిస్తున్నాడు. మరో రెండు రోజుల్లో ఓవల్ స్టేడియంలో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఫైట్ జరగనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burns crop | నీళ్లు లేక కరెంట్ రాక..సూర్యాపేట జిల్లాలో పంటను కాలబెట్టిన కౌలు రైతు
AP News | తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం.. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు..!
Ishan Kishan | ఇషాన్ కిషన్ కోలుకుంటున్నాడు.. అయినా మూడో టీ20కి దూరం.. బీసీసీఐ కీలక ప్రకటన!
Gulam Nabi Azad | భారత్‌తోపాటు కశ్మీర్ ప్రజలకూ పాకిస్థాన్ శత్రువే : గులాం నబీ ఆజాద్
Arjun | అర్జున్ చిన్న కూతురు వివాహానికి పెద్ద అల్లుడు దూరం.. ఇప్పుడిదే హాట్ టాపిక్!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

