చెన్నై: దేశవాళీ సీజన్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే 2025-26 షెడ్యూల్ ఖరారు కాగా, సోమవారం నుంచి బుచ్చిబాబు టోర్నీకి తెరలేవనుంది. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్(టీఎన్‌సీఏ) ఆధ్వర్వంలో ఈనెల 18 నుంచి సెప్టెంబర్ 9 వరకు వివిధ వేదికల్లో బుచ్చిబాబు టోర్నీ మ్యాచ్‌లు జరుగుతాయి. టోర్నీలో మొత్తం 16 జట్లు నాలుగు గ్రూపులుగా విడిపోయి ఒక్కోసారి తలపడుతాయి.
ప్రతీ గ్రూపులో టాప్‌లో నిలిచిన నాలుగు జట్లు నేరుగా సెమీఫైనల్లోకి ప్రవేశిస్తాయి. సెప్టెంబర్ 9న టోర్నీ ఫైనల్ జరుగుతుంది. రానున్న సిరీస్‌లను దృష్టిలో పెట్టుకుని జాతీయ జట్టులో చోటు ఆశిస్తున్న రుతురాజ్ , సర్ఫరాజ్‌ఖాన్, ఆయూశ్ మాత్రె తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.