ENGW vs AUSW : మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్(58 నాటౌట్) అర్ధ శతకంతో చెలరేగింది. టాపార్డర్ విఫలమైనా క్రీజునంటుకున్న బ్రంట్.. ఫ్రెయా కెంప్(44 నాటౌట్)తో కీలక భాగస్వామ్యం నెలకొల్పింది. ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న ఈ జంట ఐదో వికెట్‌కు రన్స్ రాబట్టింది. చివరి ఓవర్లో కెంప్ సిక్సర్‌తో ఇంగ్లండ్ 150 పరుగులకు చేరుకుంది. రికార్డు స్థాయిలో ఆరుసార్లు విజేతగా నిలిచిన ఆసీస్.. ఛేదనలో రెచ్చిపోతుందా? ఆతిథ్య జట్టే కప్‌ను అందుకుంటుందా? అనేది ఉత్కంఠ రేపుతోంది.
టాస్ ఓడిన ఇంగ్లండ్‌కు ఫైనల్లో శుభారంభం దక్కలేదు. ఓపెనర్ అమీ జోన్స్(6)ను ల్యూసీ హామిల్టన్ ఔట్ చేయగా.. డేంజరస్ డాని వ్యాట్ హొడ్గే(8) సైతం విఫలమైంది. టపటపా రెండు కీలక వికెట్లు పడిన వేళ.. కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్(58 నాటౌట్) బాధ్యతగా ఆడింది. ఒత్తిడిలోనూ ధనాధన్ ఆడిన అలలీసే క్యాప్సే(23) ఆసీస్ బౌలర్ల లయను దెబ్బతీసింది. అయితే.. గార్డ్నర్ వేసిన 9 ఓవర్లో క్యాప్సే 6, 4, 4 తో 16 రన్స్ పిండుకోగా స్కోర్ 60 దాటింది. అదే విధంగా ధాటిగా ఆడే క్రమంలో మొలినెక్స్ వేసిన బంతిని స్కూప్ చేయబోయి క్యాప్సే బౌల్డయ్యింది. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే హీథర్ నైట్(2) వికెట్ల ముందు దొరికిపోయింది. అంతే.. ఇంగ్లండ్ కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి.
Nat Sciver-Brunt’s 58* anchors England to 150/4 – will it be enough to hold off Australia?
The highest target successfully chased in a Women’s #T20WorldCup final is 149 by West Indies against Australia in 2016 👀 pic.twitter.com/XKqF0Zc6jm
— Cricinfo (@cricinfo) July 5, 2026
చూస్తుండగానే నాలుగు వికెట్లు పడినా.. కెప్టెన్ బ్రంట్ పట్టువదల్లేదు. ఫ్రెయా కెంప్(44 నాటౌట్)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించింది. తొలుత సింగిల్స్, డబుల్స్ తీసిన కెంప్ కాస్త కుదురుకున్నాక బౌండరీలతో స్కోర్ వేగం పెంచింది. సథర్లాండ్ ఓవర్లో తను రెండు ఫోర్లు బాదగా స్కోర్ వందకు చేరింది. ధాటిగా ఆడి 37 బంతుల్లో హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిందీ జంట. మొలినెక్స్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో కెంప్ స్ట్రెయిట్ సిక్సర్‌తో ఆతిథ్య జట్టు 4 నష్టానికి 150 పరుగులు చేయగలిగింది.
Nat Sciver-Brunt battles her way to a 45-ball fifty in the #T20WorldCup final 👊 pic.twitter.com/CW9Vwbyddk
— Cricinfo (@cricinfo) July 5, 2026