టోక్యో: ఒలింపిక్స్‌లో బాక్సర్ లవ్లీనా చరిత్ర సృష్టించింది. ఆమె ఇండియాకు మరో మెడల్ ఖాయం చేసింది. 64-69 కేజీల విభాగంలో శుక్రవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో లవ్లీనా అద్భుతమైన విజయం సాధించింది. చైనీస్ తైపీకి చెందిన చెన్ చిన్‌పై 4-1 తేడాతో గెలిచింది. ఈ విజయంతో ఆమె సెమీఫైనల్లో అడుగుపెట్టింది. బాక్సింగ్ సెమీస్ ఫలితంతో సంబంధం లేకుండా ఇండియాకు మరో మెడల్ ఖాయం. సెమీస్‌లో ఒకవేళ లవ్లీనా ఓడినా.. బ్రాంజ్ మెడల్ మాత్రం ఖాయం.
లవ్లీనా మూడు రౌండ్లలోనూ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి రౌండ్లో 3:2 తో ఆధిక్యంలో ఉండగా.. రెండో రౌండ్లో మొత్తం ఐదుగురు జడ్జీలు లవ్లీనాకే 10 స్కోరు ఇచ్చారు. ఇక మూడో రౌండ్లో నలుగురు లవ్లీనా వైపే మొగ్గారు. దీంతో ఆమె 4-1తో గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టింది.
India is confirmed of 2nd Olympics medal🇮🇳
— Kiren Rijiju (@KirenRijiju) July 30, 2021
What a lovely Boxing from Lovlina🥊@LovlinaBorgohai has reached semi-finals and looking for Gold medal in #Tokyo2020 Olympics!#Cheer4India pic.twitter.com/Rc3IU93svF
#IND have been assured of their second medal at #Tokyo2020
— Olympic Khel (@OlympicKhel) July 30, 2021
Lovlina Borgohain of #IND outpunches #TPE's Chen Nien-Chin in welterweight category (64-69kg) to advance to the semis 🔥#Tokyo2020 #StrongerTogether #UnitedByEmotion #Boxing @LovlinaBorgohai pic.twitter.com/JyYlNvGLze
CREATES HISTORY 🤩@LovlinaBorgohai puts up a brilliant performance and secures 1st medal for 🇮🇳 from boxing in 69 kg at @Tokyo2020 She beat Chinese Taipei's Chen NC 4-1 in QF to reach semis 🥳#RingKeBaazigar#boxing#Tokyo2020#Cheer4India#TeamIndia pic.twitter.com/28cpzoUxZY
— Boxing Federation (@BFI_official) July 30, 2021