Border–Gavaskar Trophy | భారత్‌తో తొలి టెస్టుకు దూరం కానున్న ఆస్ట్రేలియా స్టార్ పేసర్!
2023 ఫిబ్రవరిలో ఇండియా టూర్లో టెస్టు సిరీస్ ఆడనున్న ఆస్ట్రేలియా
Border–Gavaskar Trophy : వచ్చే ఏడాది భారత్, ఆస్ట్రేలియా జట్లు బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో తలపడనున్నాయి. ఇరు జట్లు ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ .. స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ తొలి టెస్టుకు దూరమయ్యే అవకాశం ఉంది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో స్టార్క వేలికి గాయం అయింది. కొంత కాలంగా కాలి పిక్కల గాయంతో అతను బాధపడుతున్నాడు. దాంతో, అతను కోలుకునేందుకు మరికాస్త సమయం పట్టేలా ఉంది. ఫిబ్రవరి 9న భారత్‌తో జరిగే మొదటి టెస్టుకు అతను దూరమయ్యే అవకాశం ఉంది. రెండో టెస్టులో ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ కుడిచేతి చూపుడు వేలికి గాయమైంది. దాంతో అతను త్వరలోనే సర్జరీ చేయించుకోనున్నాడు. దాంతో, మూడో టెస్టుకు స్టార్క్, గ్రీన్ విశ్రాంతి తీసుకోనున్నారు.
2023 ఫిబ్రవరిలో ఇండియా టూర్లో ఆస్ట్రేలియా నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. విశేషం ఏంటంటే.. ఇదే చివరి బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ. దాంతో ఇరుజట్లు విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నాయి. ఈ సిరీస్ గెలిచి వరల్డ్ టెస్టు ప్రపంచ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)ఫైనల్ అవకాశాల్ని మెరుగుపరుచుకోవాలని చూస్తున్నాయి. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా (132) అగ్రస్థానంలో ఉంది. భారత్ 99 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

