WTL 2025 : భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న(Rohan Bopnna) మళ్లీ రాకెట్ పడుతున్నాడు. ఇటీవలే వీడ్కోలు పలికిన బోపన్న వరల్డ్ టెన్నిస్ లీగ్(WTL 2025)లో బరిలోకి దిగుతున్నాడు. స్వదేశంలో డిసెంబర్లో జరుగబోయే ఈ టోర్నీలో అతడు వరల్డ్ నంబర్ 13 డానిల్ మెద్వెదేవోతో కలిసి ఆడనున్నాడు. మరో భారత స్టార్ సుమిత్ నగాల్ సైతం ఈ ఈవెంట్లో పాల్గొంటున్నాడు. ఫ్రాన్స్ ఆటగాడు గేల్ మొన్ఫిల్స్తో కలిసి ఆడేందుకు నగాల్ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాడు.
బెంగళూరు వేదికగా డిసెంబర్లో వరల్డ్ టెన్నిస్ లీగ్ ప్రారంభం కానుంది. 17 నుంచి 20వ తేదీ వరకూ ఈ మెగా టోర్నీ జరుగనుంది. ఈ లీగ్‌లో నాలుగు ఫ్రాంచైజీలు పోటీపడనున్నాయి. గేమ్ ఛేంజర్స్ ఫాల్కన్స్, వీబీ రియాల్టీ హాక్స్, ఆసీ మ్యావెరిక్ కైట్స్, ఏఓఎస్ ఈగిల్స్.. తరఫున స్టార్ ఆటగాళ్లు బరిలోకి దిగుతున్నారు. ‘
Magda Linette w drużynie Falcons w Indiach! 🦅
Polka zagra w turnieju pokazowym World Tennis League rozgrywanym 17-20 grudnia w Bengaluru 🇮🇳
W drużynie znajdą się również m. in.: Daniil Medvedev oraz Rohan Bopanna. Zapowiada się ekscytująco! pic.twitter.com/ZvVE5Zl67l
— Magda Linette Fanpage (@MagdaLinetteFP) November 24, 2025
గేమ్ ఛేంజర్స్ ఫాల్కన్స్ స్క్వాడ్‌కు మెద్వెదేవ్ సారథిగా వ్యహరిస్తాడు. డబుల్స్ దిగ్గజం బోపన్న, మగ్దా, సహజతో మా టీమ్ పటిష్టంగా ఉంది. ఈ సీజన్లో అద్భుత ప్రదర్శన చేస్తామని ఆశిస్తున్నా’ అని ఫాల్కన్స్ యజమాని అమందీప్ సింగ్ వెల్లడించాడు.
గేమ్ ఛేంజర్స్ ఫాల్కన్స్ – డానిల్ మెద్వెదేవ్, రోహన్ బోపన్న, మగ్ద లిన్నెటె, సహజ యమలపల్లి.
వీబీ రియాల్టీ హాక్స్ – డెనిస్ షపోవలోవ్, యుకీ బాంబ్రీ, ఎలీనా స్వితోలినా, మయా రేవతి.
ఆసీ మ్యావెరిక్ కైట్స్ – నిక్ కిర్గియోస్, దక్షిణేశ్వర్ సురేశ్, మర్తా కొస్త్యుక్, అంక్రిత రైనా.
ఏఓఎస్ ఈగిల్స్ – గేల్ మొన్ఫిల్స్, సుమిత్ నగాల్, పౌలా బడోసా, శ్రీవల్లి భమిడిపటి.