బాసెల్ (స్విట్జర్లాండ్): స్విస్ ఇండోర్స్ బాసెల్ ఏటీపీ 500 టెన్నిస్ టోర్నీలో భారత వెటరన్ టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న, తన అమెరికన్ సహచరుడు బెన్ షెల్టన్ ద్వయం సెమీస్‌కు దూసుకెళ్లింది. పురుషుల క్వార్టర్స్‌లో ఈ ఇండో-అమెరికన్ జోడీ.. 6-3, 3-6, 10-3తో హర్బర్ట్, నికోలస్ మహుత్ (ఫ్రాన్స్)పై అలవోక విజయంతో సెమీస్‌కు ప్రవేశించింది.