French Open : పురుషుల డబుల్స్‌లో సంచలన విజయాలు సాధిస్తున్న రోహన్ బోపన్న(Rohan Bopanna) జోడీ మరో టైటిల్‌కు చేరువైంది. ఫ్రెంచ్ ఓపెన్(French Open)లో భాగంగా బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో బోపన్న – మాథ్యూ ఎబ్డెన్ (Mathew Ebden) జంట అద్భుత విజయం సాధించింది. ఇండో ఆస్ట్రేలియన్ జటకు చెక్ పెట్టి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. సాండర్ జిల్లే, జోరాన్ విలెజెన్ జంటపై బోపన్న ద్వయం 7-6, 5-7, 6-1తో గెలుపొందింది.
ప్రీ క్వార్టర్స్‌లో అతికష్టమ్మీద ఎన్ శ్రీరామ్ బాలాజీ, మిగెల్ ఆంజెల్ రెయెస్ వరెలా ద్వయంపై గట్టెక్కిన బోపన్న – ఎబ్డెన్ జంట సెమీస్ బెర్తు ఫైట్‌లో అదరగొట్టింది. సాండర్, జోరాన్లపై ఆధిపత్యం చెలాయిస్తూ తొలి, మూడో సెట్ గెలిచి మ్యాచ్ ముగించింది. సెమీఫైనల్లో ఇటలీ జంట సిమొనె బొలెలి, అండ్రియా వవస్సోరితో తలపడే చాన్స్ ఉంది. 2017లో మిక్స్డ్ డబుల్స్ టైటిల్ సాధించిన బోపన్న మట్టి కోర్టులో మరో టైటిల్‌కు రెండడుగుల దూరంలో నిలిచాడు.