Bhuvneshwar Kumar : భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar)కు బంపర్ ఆఫర్ వచ్చింది. ఫ్రాంచైజీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న అతడు ఏకంగా టీమిండియాకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అలాఅనీ బీసీసీఐ, సెలెక్టర్లు భువిని సారథిగా ప్రకటించలేదు. మరి ఇదెలా సాధ్యం? అని ఆశ్చర్యపోతున్నారా. మీరు నోరెళ్లబెడుతున్నట్టు.. ఇండియాలో కాదు విదేశీ లీగ్‌లో భారత బృందానికి వెటరన్ స్పీడ్‌స్టర్ కెప్టెన్సీ వహించనున్నాడు. హాంకాంగ్ సిక్సెస్-2026 ఎడిషన్ కోసం ప్రకటించిన భారత స్క్వాడ్‌కు అతడు సారథ్యం వహించనున్నాడు.
ఒకప్పుడు భారత జట్టులో ప్రధాన పేసర్‌గా కొనసాగిన భువనేశ్వర్ కుమార్ మరోమారు కీలక పాత్ర పోషించనున్నాడు. బీసీసీఐ, సెలెక్టర్ల పిలుపు కోసం మూడేళ్లకు ఎదురుచూసి అలసిపోయిన అతడికి విదేశీ లీగ్‌లో కెప్టెన్సీ దక్కింది. అది కూడా భారత బృందానికి నాయకుడిగా. హాంకాంగ్ సిక్సెస్ – 2026 ఎడిషన్ కోసం భువి సారథిగా ఎంపికయ్యాడు. ప్రతి జట్టులో ఆరుగురు మాత్రమే ఉండే ఈ టోర్నీలో.. అతడు కృనాల్ పాండ్యా, నటరాజన్, త్రిపాఠి, తెవాటియా, నితీశ్, శశాంక్ సింగ్‌లతో కూడిన బృందాన్ని నడిపించనున్నాడు.
🚨Bhuvneshwar Kumar is back🚨
•India announced squad for the Hong Kong Sixes!
•Bhuvneshwar Kumar (C)
•Krunal Pandya
•Nitish Rana
•Rahul Tripathi
•Rahul Tewatia
•Shashank Singh
•T Natarajan…..see more https://t.co/ijd9gA0xxP— ALeem ALam (@ALeemALam07) October 5, 2026
భారత స్క్వాడ్‌కు కెప్టెన్‌గా ఎంపికైన భువి మాట్లాడుతూ.. ‘నేను ఇప్పటికే భారత్‌కు ఆడాను. ఇకపై మళ్లీ అది సాధ్యపడకపోవచ్చు. నాకు మరొక అవకాశం వస్తే అది నిజంగా గొప్ప విషయమే. అయితే.. అందుకు నేను సిద్ధమే. ఆటపట్ల నాకున్న ఇష్టంతోనే ఇంకా కొనసాగుతున్నా. మరింత కాలం ఆడాలంటే క్రమశిక్షణతో ఉండాలని నాకు తెలుసు. హాంకాంగ్ సిక్సెస్‌లో భారత జట్టుకు సారథ్యం వహించేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా’ అని అన్నాడు. గత సీజన్ కెప్టెన్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) నుంచి భువి బాధ్యతలు స్వీకరించనున్నాడు.
🇮🇳🔥 THE SWING MASTER RETURNS — AS SKIPPER! 👑🏏
After nearly 3 years, Bhuvneshwar Kumar is back in India colours and will lead the team at the Hong Kong Sixes 2026! ⚡
Experience. Swing. Leadership. Bhuvi is back! 🫡🔥
#BhuvneshwarKumar #Bhuvi #TeamIndia #IndianCricket https://t.co/uN7dkvOxc3
— SportsTiger (@The_SportsTiger) October 5, 2026
హాంకాంగ్ సిక్సెస్ 2026 ఎడిషన్‌లో మొత్తం పన్నెండు జట్లు పోటీపడనున్నాయి. ప్రతి దాంట్లో మూడు చొప్పున నాలుగు గ్రూపులున్నాయి. గ్రూప్ ఏ – హాంకాంగ్ చైనా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్. గ్రూప్ బీ – శ్రీలంక, బంగ్లాదేశ్, స్కాట్లాండ్. గ్రూప్ సీ – ఇండియా, పాకిస్థాన్, యూఏఈ. గ్రూప్ డీ- దక్షిణాఫ్రికా, అఫ్గనిస్థాన్, ఒమన్.
ఈసారి హాంకాంగ్‌లోని టిన్ క్వాంగో రోడ్ రిక్రియేషన్ మైదానంలో అక్టోబర్ 30వ తేదీ నుంచి నవంబర్1 తేదీ వరకూ 2026 ఎడిషన్ జరుగనుంది. 1992లో మొదలైన ఈ టోర్నీలో పలువురు వీదేశీ ఆటగాళ్లు మెరిశారు. రెండేళ్ల క్రితం మళ్లీ మొదలైన ఈ లీగ్ క్రికెట్ అభిమానులను అరిస్తోంది. ఐపీఎల్ 19వ సీజన్లో నిప్పులు చెరిగిన భువనేశ్వర్ 16 మ్యాచుల్లో 28 వికెట్లతో ఆర్సీబీ విజయంలో కీలకమయ్యాడు.
నడిపించనున్నాడు.
భారత స్క్వాడ్: భువనేశ్వర్ కుమార్(కెప్టెన్), కృనాల్ పాండ్యా, శశాంక్ సింగ్, రాహుల్ తెవాటియా, నితీశ్ రానా, రాహుల్ త్రిపాఠి, టి.నటరాజన్