మెరిసిన షమీ.. హైదరాబాద్ పేసర్ అనికేత్ పాంచ్ పటాకా
భారత జట్టులోకి పునరాగమనమే లక్ష్యంగా దేశవాళీల్లో బరిలోకి దిగినప్పుడల్లా సత్తాచాటుతున్న బెంగాల్ పేసర్ మహ్మద్ షమీ రంజీ ట్రోఫీలో భాగంగా తొలిరోజే తన పేస్ పదును చూపించాడు.
- రంజీ తొలిరోజు భారత స్టార్ ప్లేయర్ల విఫలం
కోల్‌కతా: రంజీ ఎలైట్ గ్రూప్ ‘సీ’లో భాగంగా షమీ (4/30) నాలుగు వికెట్లతో చెలరేగిన వేళ తొలి ఇన్నింగ్స్‌లో ఢిల్లీ 240 రన్స్‌కే కుప్పకూలింది. ఆకాశ్ దీప్ (2/74) ఇచ్చిన ఆరంభాన్ని సద్వినియోగం చేసుకుంటూ షమీ.. ఢిల్లీ బ్యాటర్లు యశ్ ధుల్ (9), ఆయుశ్ (45), హృతిక్ (56), దివిజ్ (24)ను ఔట్ చేసి ప్రత్యర్థిని దెబ్బతీశాడు.
ఇక రంజీ తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉన్న భారత టెస్టు ఓపెనర్లలో కేఎల్ రాహుల్.. ఏపీతో మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగులే చేయగా చండీగఢ్‌తో ఆడుతూ యశస్వీ జైస్వాల్ డకౌట్ అ య్యాడు. కాగా సౌరాష్ట్రకు ఆడుతున్న రవీం ద్ర జడేజా (72 బ్యాటింగ్) రాణించాడు.
అనికేత్ అదుర్స్
త్రిపురతో హైదరాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో జరుగుతున్న గ్రూప్-బి తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ పేసర్ అనికేత్ రెడ్డి (5/21) ఐదు వికెట్లతో అదరగొట్టాడు. అతడికి తోడు తనయ్ త్యాగరాజన్ (3/37) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో త్రిపుర 134 రన్స్‌కే కుప్పకూలింది. అనికేత్ దెబ్బకు పర్యాటక జట్టు ఆఖరి ఏడు వికెట్లను నాలుగు పరుగుల తేడాతోనే కోల్పోవడం గమనార్హం. 39 ఓవర్లకు 130/3తో ఉన్న ఆ జట్టు.. 43.6 ఓవర్లకు మరో నాలుగు పరుగులే చేసి ఆలౌట్ అయింది. హైదరాబాద్ కెప్టెన్ సిరాజ్ పొదుపుగా బౌలింగ్ చేసినా వికెట్లేమీ తీయలేదు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ఆతిథ్య జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 121 రన్స్ చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

