Ben Stokes : ఇంగ్లండ్ బోర్డు విచారణ ఎదుర్కొంటున్న బెన్ స్టోక్స్(Ben Stokes) మళ్లీ మైదానంలో దిగనున్నాడు. లండన్ నైట్ క్లబ్ (London Night Club) గొడవతో బోర్డు ఆగ్రహానికి గురైన స్టోక్స్ కౌంటీ ఛాంపియన్షిప్ (County Championship)లో ఆడనున్నాడు. డుర్హమ్ జట్టు స్క్వాడ్‌లో ఈ పేస్ ఆల్‌రౌండర్ చోటు దక్కించుకున్నాడు. చెస్టెర్ లె స్ట్రీట్‌లో జూన్ 19 నుంచి నార్తంప్టన్‌షైర్‌తో జరిగే మ్యాచ్‌లో సత్తా చాటాలని స్టోక్స్ భావిస్తున్నాడు.
క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొంటున్న బెన్ స్టోక్స్.. కెన్నింగ్టన్ ఓవల్ టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. అతడి స్థానంలో జో రూట్ కెప్టెన్సీ చేపట్టగా.. స్టోక్స్ కూడా క్రికెట్‌తో బిజీ అవనున్నాడు. డుర్హమ్ జట్టు తరఫున కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సీజన్లో డుర్హమ్ తరఫున స్టోక్స్ ఆడడం ఇది మూడోసారి కానుంది. ప్రస్తుతం డివిజన్ రెండు కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో డుర్హమ్ జట్టు 126 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.
UPDATE: Ben Stokes set to return to action🏏
He’s been named in Durham’s 15-man squad to face Northamptonshire tomorrow. pic.twitter.com/FBtIc9mJqJ
— Cricbuzz (@cricbuzz) June 18, 2026