BCCI | దేశవాళీ టోర్నీల ప్రైజ్‌మనీ భారీగా పెంచిన బీసీసీఐ..! రంజీ విజేతకు ఇకపై రూ.5కోట్లు..!
BCCI | భారత క్రికెట్ నియంత్రణ మండలి దేశవాళీ క్రికెట్ టోర్నీలకు సంబంధించిన ప్రైజ్‌మనీని భారీగా పెంచింది. వచ్చే సీజన్ నుంచి రంజీ ట్రోపీ విజేతకు రూ.5కోట్లు ఇవ్వనున్నది. ఇంతకు ముందు ప్రైజ్‌మనీ రూ.2కోట్లుగా ఉండేది. దాంతో పాటు మహిళల క్రికెట్ టోర్నీ ప్రైజ్‌మనీని పెంచింది.
BCCI | భారత క్రికెట్ నియంత్రణ మండలి దేశవాళీ క్రికెట్ టోర్నీలకు సంబంధించిన ప్రైజ్‌మనీని భారీగా పెంచింది. వచ్చే సీజన్ నుంచి రంజీ ట్రోపీ విజేతకు రూ.5కోట్లు ఇవ్వనున్నది. ఇంతకు ముందు ప్రైజ్‌మనీ రూ.2కోట్లుగా ఉండేది. దాంతో పాటు మహిళల క్రికెట్ టోర్నీ ప్రైజ్‌మనీని పెంచింది. మహిళల వన్డే ట్రోఫీ విజేతకు రూ.50లక్షలు, టీ20 ట్రోఫీ విజేతకు రూ.40లక్షలు చెల్లించనున్నది. ఇక రంజీ రన్నరప్‌కు రూ.3కోట్లు చెల్లించనున్నది. బోర్డు అన్ని దేశవాళీ టోర్నీల ప్రైజ్‌మనీని పెంచడంపై హర్షం వ్యక్తమవుతున్నది. భారత క్రికెట్‌కు వెన్నుముక అయిన దేశవాళీ క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చినట్లవుతుందని క్రికెట్ పండితులు పేర్కొంటున్నారు.
ఇదిలా ఉండగా.. ఇక ఇరానీ కప్ విజేతకు రూ.50లక్షలు, రన్నరప్‌కు రూ.25లక్షలు ఇవ్వనున్నది. దులీప్ ట్రోఫీ విజేతకు రూ.కోటి, రన్నర్‌కు రూ.50లక్షలు, విజయ్ హజారే టోర్నీని గెలుపొందిన జట్టుకు రూ.కోటి, రన్నర్‌కు రూ.50లక్షలకు ప్రైజ్‌మనీని పెంచింది. ప్రొఫెసర్ డీబీ దేవధర్ టోర్నీ విజేతకు రూ.40లక్షలు, రన్నర్‌కు రూ.20లక్షలు, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ విజేతకు రూ.80లక్షలు, రన్నరప్‌కు రూ.40లక్షలు, సీనియర్స్ వుమెన్స్ వన్డే ట్రోఫీ విజేతకు రూ.50లక్షలు, రన్నరప్‌కు రూ.25లక్షలు, సీనియర్స్ వుమెన్స్ టీ20 టోర్నీ విజేతకు 40లక్షలు, రన్నర్‌కు రూ.20లక్షలు చెల్లించనున్నట్లు బీసీసీ ప్రకటించింది.
I’m pleased to announce an increase in prize money for all @BCCI Domestic Tournaments. We will continue our efforts to invest in Domestic Cricket – which is the backbone of Indian Cricket. Ranji winners to get ₹5 crores (from 2 cr), Sr Women winners ₹50 lacs (from 6 lacs)🇮🇳 pic.twitter.com/Cgpw47z98q
— Jay Shah (@JayShah) April 16, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

