BAN HKG : ఆసియా కప్‌లో చిన్న జట్టు హాంకాంగ్ బౌలర్లు బంగ్లాదేశ్ బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. 143 పరుగుల ఛేదనకు దిగిన బంగ్లాకు షాకిస్తూ.. ఆదిలోనే రెండు వికెట్లు తీసి ఒత్తిడిలోకి నెట్టారు. దాంతో, పవర్ ప్లేలో 51 రన్స్ మాత్రమే చేసింది బంగ్లా. అయితే.. కెప్టెన్ లిటన్ దాస్ (26), తౌహిద్ హ్రుదయ్(25) జట్టును గెలిపించే బాధ్యత తీసుకున్నారు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 53 రన్స్ జోడించారు. 13 ఓవర్లకు 100/2. ఇంకా బంగ్లా విజయానికి 44 రన్స్ కావాలి. ఈ ఇద్దరూ మరో నాలుగైదు ఓవర్లు నిలబడితే హాంకాంగ్ మ్యాచ్‌పై ఆశలు వదిలేసుకోవల్సిందే.
ఆసియా కప్ రెండో మ్యాచ్‌లో హాంకాంగ్ బ్యాటర్లు చెలరేగారు. తామూ దంచికొట్టగలమని నిరూపిస్తూ బంగ్లాదేశ్ బౌలర్లకు చుక్కులు చూపించి జట్టుకు పోరాడగలిగే స్కోర్ అందించారు. ఓపెనర్ జీషన్ అలీ(30) శుభారంభం ఇవ్వగా.. మిడిల్ ఓవర్లలో యాసీం ముర్తాజా(28), నిజాకత్ ఖాన్(42) దూకుడుగా ఆడారు. డెత్ ఓవర్లలో నిజాకత్ సిక్సర్‌తో జట్టు స్కోర్ 130 దాటించాడు. అతడు ఔటయ్యాక.. వరుసగా వికెట్లు కోల్పోయింది హాంకాంగ్. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి143 రన్స్ చేసింది.