Ayesha Omar | సానియా మీర్జా భర్తతో ప్రేమ.. పాక్ మోడల్ ఆసక్తికర వ్యాఖ్యలు
పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తనకు మధ్య ప్రేమ వ్యవహారం వదంతులపై మోడల్, యూట్యూబర్ అయేషా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తానెప్పుడు పెళ్లి అయిన వ్యక్తిపై మనసు పారేసుకోలేదని అంది. 'పెళ్లి అయిన వ్యక్తి లేదా ఒకరితో బంధంలో ఉన్నవాళ్లకు నేను ఎప్పుడూ అట్రాక్ట్ కాలేదు' అని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పింది.
Ayesha Omar : పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్, ఆ దేశానికి చెందిన మోడల్, యూట్యూబర్ అయేషా ఒమర్ ప్రేమలో ఉన్నారనే వార్తలు ఆన్లైన్ వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే.. మాలిక్, తనకు మధ్య ప్రేమ వ్యవహారం గురించి వస్తున్న వదంతులపై అయేషా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తానెప్పుడు పెళ్లి అయిన వ్యక్తిపై మనసు పారేసుకోలేదని అంది. ‘పెళ్లి అయిన వ్యక్తి లేదా ఒకరితో బంధంలో ఉన్నవాళ్లకు నేను ఎప్పుడూ అట్రాక్ట్ కాలేదు’ అని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పింది.
దాంతో, ఇకనైనా షోయబ్, అయేషాపై వస్తున్న గాసిప్స్ ఆగుతాయా? లేదా? అనేది చూడాలి. 2021లో ఒక ఫొటోషూట్‌లో భాగంగా షోయబ్ మాలిక్, అయేషా సన్నిహితంగా ఉన్న ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో, ఆమె కారణంగానే సానియా, షోయబ్ మాలిక్ విడిపోతున్నారనే ప్రచారం సాగింది.
టాక్ షోలో కలిసి..
భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మిర్జా, పాకిస్థాన్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు పోయిన ఏడాది మీడియాలో చక్కర్లు కొట్టాయి. దాంతో, చూడముచ్చటైన ఈ జంట ఎందుకు విడిపోతుంది? అనేది తెలియక అందరూ షాక్‌కు గురయ్యారు. అయితే.. సానియా లేదా షోయబ్ డైవర్స్ వార్తలపై స్పందించలేదు. అంతేకాదు తాము విడిపోతున్నట్టు ఈ జంట అధికారికంగా ఇప్పటివరకూ ఎక్కడా ప్రకటన చేయలేదు. విడాకుల వార్తలు ప్రచారంలోకి వచ్చాక కూడా వీళ్లిద్దరూ ది మిర్జా మాలిక్ అనే టాక్ షోలో కలిసి నటించడం విశేషం.
టెన్నిస్‌కు వీడ్కోలు
వీళ్ల వివాహం 2010 ఏప్రిల్ 12న దుబాయ్‌లో జరిగింది. ఈ జంటకు ఇజాన్ మాలిక్ మిర్జా అనే నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. డబుల్స్‌లో వరల్డ్ నంబర్ వన్ ర్యాంకు సాధించిన సానియా మిర్జా టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. కెరీర్లో చివరి గ్రాండ్‌స్లామ్ ఆడుతున్న సానియా మిర్జా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అదరగొట్టింది. రోహన్ బోపన్నతో జోడీ కట్టిన ఆమె మిక్స్డ్ డబుల్స్‌లో రన్నరప్‌గా నిలిచింది. దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్షిప్ ఆమె ఆడనున్న ఆఖరి టోర్నమెంట్.
ఇవి కూడా చదవండి
Muhammad Asif | 2007 వరల్డ్ కప్ ఫైనల్లో సిక్స్ కొట్టాలని మిస్బాకు చెప్పా : పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్
Viral Kohli | విరాట్ కోహ్లీకి యువతి లిప్ కిస్..! సోషల్ మీడియాలో వీడియో వైరల్..!
Aakash Chopra | బుమ్రా ఐపీఎల్ ఆడకుంటే ప్రపంచం ఏమీ ఆగిపోదు : ఆకాశ్ చోప్రా
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

